Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 10, 2026 / 01:17 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సూరి (Hero)
  • మహిమా నంబియార్ (Heroine)
  • సుహాస్‌, మిథున్ జై శంక‌ర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, స‌త్య‌రాజ్ త‌దిత‌రులు (Cast)
  • మతిమారన్ పుగళేంది (Director)
  • వెట్రిమార‌న్‌, ఎల్రెడ్ కుమార్‌ (Producer)
  • జి.వి. ప్రకాష్ కుమార్ (Music)
  • ఎస్.ఆర్. కథిర్ (Cinematography)
  • ప్రదీప్ ఇ. రాఘవ్ (Editor)
  • Release Date : 10th సెప్టెంబర్ 2026
  • ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ (Banner)

కోలీవుడ్ క‌మెడియ‌న్ సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ మండాడి (Mandaadi) అదే పేరుతో తెలుగులోనూ రిలీజైంది. అగ్ర ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ ప్రొడ్యూస‌ర్ కావ‌డం, ట్రైల‌ర్స్‌, టీజ‌ర్ కొత్త‌గా ఉండ‌టంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. మండాడి మూవీకి మ‌తిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హిమా నంబియార్ హీరోయిన్‌గా న‌టించింది. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. మండాడి ఎలా ఉంది? ఈ త‌మిళ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? అంటే?

Mandaadi Movie Review

Mandaadi Movie Review and Rating

క‌థ‌: క‌ళింగ‌ప‌ట్నంలో తెర‌చాప పందెం పోటీల్లో చాలా ఏళ్లుగా సాట్టాపులికి (Suhas) చెందిన జ‌ట్టు విజ‌యం సాధిస్తుంటుంది. సాట్ట‌పులికి వ్య‌తిరేకంగా మ‌ల్లేషం (మిథున్ జై శంక‌ర్‌)ల‌ ఓ టీమ్ త‌యారు చేస్తాడు. అది స‌హించ‌లేని సాట్టాపులి మ‌నుషులు మ‌ల్లేషాన్ని చంపాల‌ని అనుకుంటారు. అత‌డిని కాళి (Soori) కాపాడుతాడు. కాళిది కళింగ‌ప‌ట్న‌మే. సాట్టాపులికి ప్రాణ స్నేహితుడు. ఇర‌వై ఏళ్ల క్రితం ఇద్ద‌రు క‌లిసి తెర‌చాప పందెం పోటీల్లో పాల్గొంటారు. వారికి మున‌య్య (స‌త్య‌రాజ్‌) ట్రైనింగ్ ఇస్తాడు. మున‌య్య కూతురు ఏంజెల్‌ను (మ‌హిమా నంబియార్‌) కాళి ప్రేమిస్తాడు.

తాను ఎద‌గ‌డం కోసం సాట్టాపులి చేసిన కుట్ర‌ల వ‌ల్ల మున‌య్య చ‌నిపోతాడు. ఆ గొడ‌వ‌ల కార‌ణంగా తాను ప్రేమించిన ఏంజెల్‌కు దూర‌మైన కాళి క‌ళింగ‌ప‌ట్నం వ‌దిలివెళ్లిపోతాడు. మ‌ల్లేషానికి తెర‌చాప పందెం పోటీల్లో ట్రైనింగ్ ఇచ్చి గెలిపిస్తాన‌ని సాట్టాపులితో ఛాలెంజ్ చేస్తాడు కాళి. ఆ ఛాలెంజ్‌లో అత‌డు నెగ్గాడా? కాళికి సాట్టాపుట్టి ఎలాంటి న‌మ్మ‌క ద్రోహం త‌ల‌పెట్టాడు? కాళిని పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డ్డ ఏంజెల్ అత‌డిని ఎందుకు దూర‌మైంది? త‌న‌ టీమ్‌ను గెలిపించ‌డానికి చివ‌ర‌కు ఆ జ‌ట్టులో ఓ మెంబ‌ర్‌గా కాళి ఎందుకు మారాల్సివ‌చ్చింది అన్న‌దే మండాడి మూవీ క‌థ‌.

Mandaadi Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: కాళి అనే మాస్ రోల్‌లో సూరి ఒదిగిపోయాడు. అత‌డి బాడీలాంగ్వేజ్‌, మ్యాన‌రిజ‌మ్స్ అచ్చం మ‌త్స్య‌కారుడిలానే ఉన్నాయి. నెగెటివ్ పాత్ర‌లో సుహాస్ అద‌ర‌గొట్టాడు. డైలాగ్స్‌తోనే విల‌నిజాన్ని పండించాడు. రెండు డిఫ‌రెంట్ లుక్‌ల‌లో అత‌డు చూపించిన వేరియేష‌న్ బాగుంది. మ‌హిమా నంబియార్ నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకుంది. ఓ కీల‌క పాత్ర‌ల్లో స‌త్య‌రాజ్ క‌నిపించారు. హీరోకు గురువుగా హుందాగా అత‌డి పాత్ర సాగింది. ర‌వీంద్ర విజ‌య్ మిన‌హా తెలుగు ఆడియెన్స్‌కు తెలిసిన న‌టులు ఈ సినిమాలో లేరు. ఏంజెల్ కొడుకుగా మిథున్ జై శంక‌ర్ న‌ట‌న ఓకే.

Mandaadi Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: తెర‌చాప పందెం పోటీలు అనే రిస్కీ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు మ‌తిమార‌న్ పుగ‌లేంది ఈ క‌థ‌ను రాసుకున్నారు. పోటీల వ‌ర‌కు క‌థ కొత్త‌గా ఉంది. కానీ దాని చుట్టూ అల్లుకున్న డ్రామా రొటీన్‌గా సాగింది. క‌థను ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఎంగేజింగ్‌గా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోయాడు. టెక్నిక‌ల్‌గా మాత్రం జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్‌, ఎస్ఆర్ క‌థిర్ సినిమాటోగ్ర‌ఫీ మండాడికి బ్యాక్‌బోన్‌గా నిలిచాయి. నిజ‌మైన‌ తెర‌చాప పోటీలు చూసిన ఫీలింగ్‌ను త‌న విజువ‌ల్స్‌తో ఆడియెన్స్‌లో క‌లిగించారు కెమెరామెన్ క‌థిర్‌. ఆ సీన్ల‌కు జీవీ ప్ర‌కాష్ కుమార్ బీజీఎమ్ బాగుంది. ద‌ర్శ‌కుడి విజ‌న్‌ను న‌మ్మి ప్రొడ్యూస‌ర్లు సినిమా కోసం భారీగానే ఖ‌ర్చుపెట్టారు.

Mandaadi Movie Review and Rating

విశ్లేష‌ణ‌: ద‌క్షిణాదిలో స్పోర్స్ట్ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు ఎక్కువ‌గా క్రికెట్‌, క‌బ‌డ్డీ…ఆట‌ల నేప‌థ్యంలోనే వ‌చ్చాయి. వాటికి భిన్నంగా ఓ నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నంగా మండాడి నిలిచింది. తెర‌చాప ప‌డ‌వ పోటీల చుట్టూ ఫెయిల్యూర్ ల‌వ్‌స్టోరీ, రివేంజ్ డ్రామాతో ద‌ర్శ‌కుడు మ‌తిమార‌న్ ఈ క‌థ‌ను రాసుకున్నాడు.ఈ క‌థ‌కు సూరి, సుహాన్ లాంటి నాచుర‌ల్ ప‌ర్ఫార్మ‌ర్లు దొర‌క‌డం ప్ల‌స్స‌య్యింది. ఇద్ద‌రూ పోటీప‌డి న‌టించారు. సూరికి ధీటుగా సుహాస్ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు రాసుకున్న ఎస్లాబ్లిష్ చేయ‌డం బాగుంది.

ఫ‌స్ట్ హాఫ్ మొత్తం స‌స్పెన్స్ బిల్డ్ చేస్తూ వెళ్లారు డైరెక్ట‌ర్‌. క‌ళింగ‌ప‌ట్నానికి కాళి ఎందుకు దూర‌మ‌య్యాడు? ఏంజెల్…కాళిని ద్వేషించ‌డానికి కార‌ణ‌మేమిటి? సాట్టాపులితో అత‌డికి ఎలాంటి గొడ‌వ‌లు ఉన్నాయ‌నే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో క‌లిగించాడు. సెకండాఫ్‌లో ఈ చిక్కుముడులు విప్పుతూ వెళ్లారు డైరెక్ట‌ర్‌. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ఇంకాస్త థ్రిల్లింగ్‌గా రాసుకుంటే బాగుండేది. హీరో వెన్నంటి ఉంటూ అత‌డికి విల‌న్ ద్రోహం చేయ‌డం, ఊరికి దూరం చేయ‌డం అనే కాన్సెప్ట్‌తో తెలుగు, త‌మిళంలో చాలానే సినిమాలు వ‌చ్చాయి. అదే అరిగిపోయిన ఫార్ములాను మ‌రోసారి వాడేశారు.

ప‌డ‌వ పోటీల తాలూకు సీన్స్ బాగున్నాయి. అవ‌న్నీ బిగ్‌స్క్రీన్‌లో ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను క‌లిగిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్, సుడిగుండం సీన్ గూస్‌బంప్స్ క‌లిగిస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎద‌రైన హీరో గెల‌వ‌డం సినిమాల్లో కామ‌న్‌. ఇందులో అదే జ‌రుగుతుంది.

తెలుగు డ‌బ్బింగ్‌, టైటిల్స్ విష‌యంలో క్వాలిటీ లేదు. హీరోతో పాటు మిగిలిన ప్లేయ‌ర్స్ ధ‌రించే జెర్సీల‌పై పేర్లు ఓ సారి త‌మిళంలో మ‌రోసారి తెలుగులో క‌నిపిస్తాయి. సుహాస్ పేరు, టైటిల్ కూడా తెలుగు నేటివిటికి త‌గ్గ‌ట్లుగా ఉంటే బాగుండేది.

Mandaadi Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: మండాడి పేరుతో ఉన్న కొత్త‌ద‌నం, క్రియేటివిటి సినిమాలో లేదు. తెర‌చాప పోటీలు త‌ప్పితే మిగిలిన‌ క‌థ రొటీనే.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahima Nambiar
  • #Mandaadi Movie
  • #Sathyaraj
  • #Soori
  • #Suhas

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

11 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

13 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

16 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

18 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

19 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

19 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version