లక్కీ ఛాన్స్ కొట్టేసిన అదితిరరావ్ హైదరీ
- March 13, 2019 / 06:23 PM ISTByFilmy Focus
ఏదో మొదట బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయింది కానీ… నిజానికి అదితిరావు హైదరీది హైద్రాబాదే. కాకపోతే.. బాలీవుడ్ సినిమాలతోనే మనకి పరిచయమయ్యింది. అయితే.. మణిరత్నం తెరకెక్కించిన “చెలియా, నవాబ్” మరియు “సమ్మోహనం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువమంది అభిమానులున్నారు. కాకపోతే.. తెలుగులో భారీ అంచనాల నడుమ విడుదలైన “అంతరిక్షం” ఫెయిల్ అవ్వడంతో ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
- చిత్రలహరి టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- 118 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
దాంతో.. అదితిరావు హైదరీని తెలుగు తెరకు పరిచయం చేయడంతోపాటు మొదటిసారి ఆమె చేత స్వయంగా డబ్బింగ్ చెప్పించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఆమెకు మరో అవకాశం ఇవ్వనున్నాడట. నాని 25వ చిత్రానికి దర్శకత్వం వహించనున్న మోహన్ కృష్ణ ఒక హీరోయిన్ గా అదితిరావును ఫైనల్ చేశాడట. నిజానికి నవాబ్ సినిమాలో నాని నటించాలి.. కానీ ఇప్పుడు మణిరత్నం హీరోయిన్ తో సరిపెట్టుకొంటున్నాడు.
















