చంద్రబాబు భార్యగా మంజిమా మోహన్

  • August 14, 2018 / 07:53 AM IST

ఎప్పుడైతే “ఎన్టీఆర్” బయోపిక్ బాధ్యతను బాలయ్య తనకు ఇష్టమైన దర్శకుడు క్రిష్ కు అప్పగించాడో.. అప్పట్నుంచి క్రిష్ ఈ ప్రొజెక్ట్ ను ట్రాక్ ఎక్కించడమే కాకుండా రాకెట్ స్పీడ్ తో షూటింగ్, క్యారెక్టర్స్ ఫైనల్ చేయడం వంటివి చేస్తూ వాయువేగంతో చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే చంద్రబాబు నాయుడుగా రాణాను ఫైనల్ చేయడమే కాక నిన్నట్నుంచి రాణాతో షెడ్యూల్ కూడా మొదలుపెట్టిన క్రిష్.. ఇప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్ర కోసం “సాహసం శ్వాసగా సాగిపో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మంజిమను సెలక్ట్ చేసినట్లు సమాచారం.

“సాహసం శ్వాసగా సాగిపో” అనంతరం మంజీమ తెలుగులో మరో సినిమా చేయలేదు. తమిళంలో, మలయాళంలో బిజీగా ఉండడంతోపాటు.. మరీ బొద్దుగా ఉండడంతో అమ్మడిని మన దర్శకనిర్మాతలు పెద్దగా ఎంకరేజ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తో అమ్మడు మళ్ళీ తెలుగులో అవకాశాలు దక్కించుకొంటుందేమో చూడాలి. ఇకపోతే.. మంజిమ రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం ఆమె మలయాళం వెర్షన్ “క్వీన్” రీమేక్ లో నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus