Manju Warrier: లగ్జీరియస్ బీఎండబ్ల్యూ బైక్ కొన్న హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సూపర్ స్టార్ మంజు వారియర్.. పాపులర్ మలయాళీ యాక్ట్రెస్.. క్లాసికల్ డ్యాన్సర్, సింగర్, ప్రొడ్యూసర్.. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారామె.. ఇటీవల ‘తల’ అజిత్ కుమార్ పక్కన ‘తునివు’ (తెగింపు) లోనూ నటించిన మంజు.. అజిత్ స్ఫూర్తితో ఓ లగ్జీరియస్ కాస్ట్లీ బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశారు.. మంజు వారియర్ BMW R 1250 GS మోడల్ బైక్ సొంతం చేసుకున్నారు.. దీని ఖరీదు దాదాపు రూ. 21 లక్షల వరకు ఉంటుందట..

కొచ్చిలోని బీఎండబ్ల్యూ షోరూమ్‌లో బైక్ తీసుకుంటున్న పిక్స్, వీడియో తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు..మంజుకి బైక్స్, రేసింగ్ వంటివంటే చాలా ఇష్టం.. గతేడాది సెప్టెంబర్‌లో అజిత్‌తో కలిసి లడఖ్ ట్రిప్ వెళ్లారు కూడా.. అజిత్ రేసింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇక మంజు వారియర్ కొత్త బైక్ కొన్న ఫోటోలు, వీడియో పోస్ట్ చేయగా.. ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus