Marina, Rohit: స్వీట్ హగ్ తర్వాత గట్టి వార్నింగ్ ఇచ్చిన మెరీనా..! అసలు మేటర్ ఇదే..!

  • September 7, 2022 / 11:12 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో స్వీట్ కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు మెరీనా అండ్ రోహిత్ జంట. సీజన్ 3లో వితిక అండ్ వరుణ్ ఇద్దరూ జంటగా వచ్చి ఆకట్టుకున్నట్లుగానే వీళ్లిద్దరూ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మిగతా హౌస్ మేట్స్ అందరితో కలిసి బాగానే ఉన్నారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి కంప్లైట్ లేదు. అయితే, రెండో రోజు డైనింగ్ రూమ్ లో ఇద్దరూ కాసేపు ఫన్ చేసుకున్నారు.

గీతూ వీళ్లకి ప్రైవసీ కావాలంటే కన్ఫెషన్ రూమ్ సందులోకి వెళ్లి హగ్ చేస్కోండి పర్లేదు అంటూ మాట్లాడింది. హగ్ చేసుకోవడానికి ప్రైవసీ ఎందుకు అంటూ రోహిత్ అక్కడే మెరీనాని హగ్ చేసుకున్నాడు. స్వీట్ హగ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రోల్ బేబీ రోల్ టాస్క్ జరిగింది. ఇందులో ఇనయా సుల్తానా ఓడిపోయింది. అలాగే నేహా చౌదరి గెలిచి క్లాస్ టీమ్ లోకి చేరిపోయింది. ఆ తర్వాత వాష్ రూమ్ లోకి వచ్చిన మెరీనా తన హస్బెండ్ తో ఆరోహి రావ్ గురించి కొన్ని విషయాలు చెప్తోంది.

మనోడు వింటూనే అద్దంలో తన బాడీ షేప్స్ ని చూసుకుంటున్నాడు. దీంతో కోపమొచ్చిన మెరీనా నీ బాడీ అయినా చూస్కో లేదా నేను చెప్పేదైనా విను అంటూ సీరియస్ అయ్యింది. రోహిత్ పర్లేదు చెప్పు, వింటున్నా అంటూ బ్రతిమిలాడినా కూడా మెరీనా వినిపించుకోలేదు. కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలి మాట్లాడేటపుడు అటెన్షన్ గా వినాలి అన్నట్లుగా భర్తని దుమ్ముదులిపేసింది.

ఇలా ఉంటే నాకు నచ్చదబ్బా అంటూ స్ట్రయిట్ గా చెప్పేసి అక్కడ్నుంచీ వెళ్లిపోయింది. బిగ్ బాస్ ఇలా మొగుడు పెళ్లాలు ఎప్పుడు కొట్టుకుంటారా అని కాచుకుని కూర్చుంటాడు కాబట్టి ఈ ప్రోమోని రెండు మూడుసార్లు వేసి మరీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు. దీంతో హౌస్ లో మొగుడు పెళ్లాల లొల్లి షురూ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వస్తున్నాయి. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus