Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

‘మీవోడికి పెళ్లి చేసేయండి.. అంతా సెట్‌ అయిపోతుంది’.. ఈ మాట మీరు మీ ఇంట్లోనే, మీ ఫ్రెండ్‌ ఇంటిలో ఎవరో ఒకరు అనే ఉంటారు. మీరు వినే ఉంటారు. ఇందులో చాలా వరకు నిజం ఉంది అని కొన్ని ఉదాహరణలు బట్టి మీరు తేల్చేయొచ్చు కూడా. దీనికి నిలువెత్తు ఉదాహరణ కావాలి అనుకుంటున్నారా? అయితే మన టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు చూడండి మీకే అర్థమైపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు రీసెంట్‌ టైమ్‌లో నలుగురు హీరోలకు పెళ్లి తర్వాత సాలిడ్‌ హిట్ పడింది.

Tollywood Stars

పెళ్లి – హిట్‌ కాన్సెప్ట్‌ పర్ఫెక్ట్‌గా మీకు అర్థం కావాలంటే కిరణ్‌ అబ్బవరం నుండి మొదలుపెడదాం. ‘రాజా వారు రాణీ గారు’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన సరైన విజయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూశారు. అయితే తొలి సినిమా హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ‘క’ సినిమా లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారు. ఆ తర్వాత మంచి కథలే చేస్తున్నాడు. నాగచైతన్య ఎప్పుడో 2009లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చినా.. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరలేకపోయాడు. అయితే శోభిత ధూళిపాళతో పెళ్లి జరిగాక ‘తండేల్‌’ రూపంలో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు.

రాజ్‌ నిడిమోరుతో వివాహం జరిగాక సమంత నుండి వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమా భారీ విజయం సాధించింది. రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి కెరీర్‌ బెస్ట్ అనిపించుకుంది. ఇక అఖిల్‌ పెళ్లి జరిగాక వచ్చిన సినిమా ‘లెనిన్‌’ కెరీర్‌లోనే తొలి మాస్‌ హిట్‌గా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా అయ్య గారే నెం.1 అంటూ నడుస్తున్న సోషల్‌ మీడియా ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. దీంతో ఇప్పుడు నెక్స్ట్‌ ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. దానికి ఆన్సర్‌ విజయ్‌ దేవరకొండ అని అంటున్నారు. రష్మిక మందనతో పెళ్లి అయిన నేపథ్యంలో నెక్స్ట్‌ సినిమా మంచి విజయం అందుకుంటుందేమో చూడాలి.

 ఈ వారం 20 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags