ఈ మధ్యనే ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో భాగంగా దర్శకుడు మారుతీ స్పీచ్ ఇస్తూ.. ‘ప్రభాస్(Prabhas) వంటి మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ ని చేశారు రాజమౌళి’ అంటూ కామెంట్ చేశాడు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. మారుతీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కామెంట్ విసిరాడు అని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్లాప్ అయినప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ టైంలో ప్రభాస్ … మారుతీతో సినిమా చేయడాన్ని ఫ్యాన్స్ ఖండించారు. అయినా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బహుశా ఆ టైంలో మారుతీ గురించి సోషల్ మీడియాలో చేసిన నెగిటివ్ కామెంట్స్ ని మనసులో పెట్టుకునే.. ‘రాజమౌళి లేకపోతే మీ హీరో కూడా మిడ్ రేంజ్ హీరోనే’ అని మారుతీ పరోక్షంగా సెటైర్ వేసినట్టు అయ్యింది. మొత్తానికి తన కామెంట్స్ పై మారుతీ స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
మారుతీ మాట్లాడుతూ.. “ఏమోనండీ.. ఈ మధ్య కొంచెం ట్రిప్ అయిపోతున్నాను. ‘బాహుబలి’ కి ముందు ఆయన ‘మిర్చి’ చేశారు. అప్పటికే అతను స్టార్. కానీ బ్యాలన్స్ చేసుకోకుండా మాట్లాడేశాను. మన దగ్గరకి ఎవరైనా పెద్దోళ్ళు వస్తే.. వాళ్లకి ఏదో ఎక్కువ చేసేయాలనే హడావిడిలో కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాం.అలాంటి పొరపాటే ఇది. కానీ నా దృష్టిలో ప్రభాస్ గారు గాడ్. నా పాలిట రాముల వారిలా వచ్చి హగ్ ఇచ్చి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు.
మారుతీ రెస్పాన్స్, క్లారిటీ, సంజాయిషీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ను కూల్ చేసేలా అయితే లేవు. ఏదో ఈ ప్రశ్నని దాటేయాలనే ఉద్దేశంతోనే కవరింగ్ ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. తప్ప.. అతను రియలైజ్ అయినట్టు లేదు. త్వరలో థియేటర్లలోకి రాబోతున్న ‘ది రాజాసాబ్’ కనుక హిట్ అయితే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ సినిమా ఫలితం తేడా కొడితే.. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతీని ఓ రేంజ్లో ఆడుకునే అవకాశం లేకపోలేదు.