మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara) ట్రైలర్ వచ్చేసింది. ఈసారి ఇది రొటీన్ ఫన్ సినిమా కాదు, సీన్ చాలా సీరియస్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉంది. ట్రైలర్ ఓపెనింగే “కేజీ రెండు కేజీలు కాదురా, 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి” అనే డైలాగ్‌తో, ఏదో పెద్ద స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ కథ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. విజువల్స్ అన్నీ చాలా డార్క్‌గా, ఓ మారుమూల అటవీ ప్రాంతం, రైల్వే ట్రాకుల బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేశారు.
ఈ స్మగ్లింగ్ గ్యాంగ్‌కు అడ్డంగా నిలబడేదే మన మాస్ మహారాజా. “అది మన ఊరు స్టేషన్ మీద నుంచే వెళ్తది కదన్న, అక్కడ ఆ రైల్వే ఎస్సై గారు ఉంటాడు” అనే డైలాగ్‌తో రవితేజను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు. అయితే, ఈ క్యారెక్టర్ రొటీన్ పోలీస్ కాదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. “ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడిచింది. ఇకనుంచి… సత్యనాష్” అంటూ విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది.
ట్రైలర్‌లోనే సినిమా సోల్ పాయింట్‌ను డైరెక్టర్ భాను భోగవరపు రివీల్ చేశారు. రవితేజ క్యారెక్టర్ ఎంత డేంజరస్‌గా ఉండబోతోందో ఒక్క డైలాగ్‌తో చెప్పేశారు. “నేను రైల్వే పోలీస్ కాదు.. క్రిమినల్ పోలీస్”. ఈ డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. రైల్వే బ్యాక్‌డ్రాప్‌లో, ఒక క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ మాస్ ఊచకోత ఎలా ఉంటుందో శాంపిల్స్ చూపించారు.
అయితే, సినిమా మొత్తం ఇంత సీరియస్‌గానే ఉండదు. రవితేజ మార్క్ ఫన్, కామెడీ కూడా గట్టిగానే ఉన్నట్లుంది. హీరోయిన్ శ్రీలీల, రవితేజ మధ్య లవ్ ట్రాక్, కలర్‌ఫుల్ సాంగ్స్ బాగున్నాయి. దానికి తోడు, రాజేంద్ర ప్రసాద్‌తో కామెడీ టైమింగ్ కూడా బాగా పేలినట్లుంది. టైటిల్‌కు తగ్గట్టే, సినిమాలో “జాతర” ఎలిమెంట్ చాలా కీలకంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఆ జాతర బ్యాక్‌డ్రాప్‌లోనే చాలా రా అండ్ వైలెంట్‌గా డిజైన్ చేశారు.
“జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా ఆనవాయితీ. ఈసారి నాను నిన్ను బలిత్తానాను రా” అనే డైలాగ్, ఆ విజువల్స్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూపిస్తున్నాయి. ఓవరాల్‌గా, ‘మాస్ జాతర’ ట్రైలర్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్‌లా ఉంది. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్నీ ఇస్తూనే, ‘క్రిమినల్ పోలీస్’ అనే కొత్త క్యారెక్టరైజేషన్‌తో, సీరియస్ స్మగ్లింగ్ కథను యాడ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఫైనల్‌గా, “రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్‌లుంటాయ్.. నేను వచ్చినాక ఒకటే జోన్.. వార్ జోన్” అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించిన తీరు సూపర్బ్. ఈ సినిమా అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్‌తో థియేటర్లలోకి రానుంది.