ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు రవితేజ. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.40 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీ తోనే డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి ‘క్రాక్’ బయ్యర్స్ కు..! దాంతో రవితేజ పారితోషికం కూడా పెంచినట్టు టాక్. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో ‘ఖిలాడి’ చిత్రం చేస్తున్నాడు రవితేజ. ఇది అతనికి 67వ చిత్రం కావడం విశేషం. మే 28న ‘ఖిలాడి’ విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.దాంతో సినిమా పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి.
ఇక ‘ఖిలాడీ’ తర్వాత తన 68వ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించాడు రవితేజ. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళింది. తన 68వ చిత్రాన్ని శరత్ మండవ అనే యువ దర్శకుడితో చెయ్యబోతున్నాడు. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది. పారితోషికం ఎక్కువ ఆఫర్ చెయ్యడం వలనే రవితేజ ఈ ప్రాజెక్టుని ముందుగా చెయ్యడానికి రెడీ అయినట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఈ చిత్రం కోసం రవితేజ 30 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చాడట.
ఇందుకు గాను 8 కోట్లు పారితోషికంతో పాటు వైజాగ్, నైజాం ఏరియా రైట్స్ లో కూడా 50 శాతం షేర్ తీసుకోబోతున్నాడట. అంటే రవితేజ పారితోషికం రోజుకి 25 లక్షల పైనే ఉంటుందన్న మాట! గతంలో ‘మిరపకాయ్’ సినిమాకి కూడా ఇదే పద్ధతిలో పారితోషికం తీసుకున్నాడట రవితేజ.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!