మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ ఫస్ట్ డే కలక్షన్స్

నేచురల్‌ స్టార్‌ నాని మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ గా నటించిన చిత్రం ‘ఎంసీఏ’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా తొలిరోజున బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. వరుసగా నాని ఆరు విజయాలు సాధించడం వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయని వెల్లడించారు. అంతేకాదు నాని గత చిత్రం “నిన్నుకోరి” ఓపెనింగ్స్‌ కంటే “ఎం.సి.ఎ” అత్యధికంగా వసూలు చేసినట్లు సమాచారం. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున 15 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పరిచాడు. నాని కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్‌ చిత్రంగా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ నిలిచింది.

సాయి పల్లవి, నాని మధ్య రొమాన్స్ యువతని ఆకర్షిస్తుండగా, వదిన పాత్రలో భూమిక ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తుందని సినీ విశ్లేషకులు చెప్పారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే నిర్మాతకి లాభాలను పంచి పెట్టనుంది. ఈ మూవీ తరువాత నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ 21 వ ప్రాజక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి “కృష్ణార్జున యుద్ధం” అని పేరు కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రం చేస్తూనే నాగార్జునతో కలిసిఓ మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus