MCA Collections: నాని ‘ఎం.సి.ఎ’ కి 4 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • December 21, 2021 / 03:27 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎం.సి.ఎ’. దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. అప్పటికి నాని ‘నేను లోకల్’ ‘నిన్ను కోరి’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకుని ఫామ్లో ఉండడం.. అలాగే ‘ఫిదా’ తో సాయి పల్లవి కూడా తెలుగులో భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకోవడంతో ‘ఎం.సి.ఎ’ పై భారీ అంచనాలు నమోదయ్యాయి.

అందుకే మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో భారీ కలెక్షన్లు నమోదు చేసింది ఈ చిత్రం. నేటితో ‘ఎం.సి.ఎ’ విడుదలై 4 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 14.22 cr
సీడెడ్  5.25 cr
ఉత్తరాంధ్ర  4.10 cr
ఈస్ట్  2.45 cr
వెస్ట్  1.81 cr
గుంటూరు  2.26 cr
కృష్ణా  2.11 cr
నెల్లూరు 1.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  6.56 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 39.84 cr

‘ఎం.సి.ఎ’ చిత్రానికి రూ.29.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.39.84 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.10.61 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది. ‘ఎం.సి.ఎ’ తర్వాత నాని సినిమాలు ఈ స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ ఆ లోటుని తీరుస్తుందేమో చూద్దాం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus