హీరోల గురించి మాట్లాడినప్పుడు కటౌట్‌ల గురించి, హీరోయిన్‌ల గురించి మాట్లాడినప్పుడు ఫిజిక్ గురించి మాట్లాడతారు. కానీ హీరోయిన్ ఫొటో పెట్టి కటౌట్ అని అంటున్నారు. ఇదేంటి? అనుకుంటున్నారా? ఉందీ కారణం ఉంది. మీనాక్షి చౌదరిని (Meenakshi Chaudhary) చూశాక భలే ఫిగర్ అని అనని వాళ్లు ఉండరు. అయితే ఇదంతా ఆమె కమర్షియల్ హీరోయిన్ అవతారంలో ఉన్నప్పుడు మాత్రమే. అదే ఆమె యాక్షన్ మోడ్‌లోకి దిగితే కటౌట్ అనాలి. ఎందుకంటే మంచి హైట్, ఫిజిక్‌తో భలేగా ఉంటుంది. ఆ మధ్య ‘ధమాకా’లో కాసేపు అలా కనిపించి అదరగొట్టింది.
ఇప్పుడు ఈ భామ యాక్షన్ మోడ్‌లోకి దిగుతోంది. ఈ మేరకు శిక్షణ కూడా తీసుకుంటోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో ఏదో చిన్న పాత్ర పోషించిన ఆమె… తమిళ అగ్ర హీరో విజయ్‌తో (Vijay Thalapathy) ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె థాయ్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
థాయ్‌లాండ్‌లో ముయే థాయ్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మీనాక్షి పోస్ట్ చేసింది. థాయ్ ట్రిప్ ప్రధాన లక్ష్యం కచ్చితంగా ముయే థాయ్ బాక్సింగ్ నేర్చుకోవడమే అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె బాక్సింగ్ శిక్షణ విజయ్ సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతోంది. ‘గోట్’ సినిమాలో మీనాక్షికి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, త్వరలో మొదలు కానున్న షెడ్యూల్‌లో తనపై ఆ సీక్వెన్స్ చిత్రీకరిస్తారని సమాచారం.
నిజంగానే దీంట్లో మీనాక్షి ఆ సినిమాలో యాక్షన్ పాత్రలో కనిపిస్తుందా లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. సైన్స్ ఫిక్షన్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నాడని టాక్. డీఏజినింగ్ టెక్నాలజీ ద్వారా విజయ్ కుర్రాడిలా ఈ సినిమాలో చూపించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) ప్రయత్నం చేస్తున్నారట. అలాగే విజయ్ కాంత్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సినిమాలో చూపిస్తారట.