11న మెగా ప్రభంజనమేనా??
- January 4, 2017 / 05:43 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ఎన్నో ఆలోచనలతో ఉన్నారు మెగా ఫ్యాన్స్…అయితే యావత్ మెగా అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే….సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు అన్న టాక్…అభిమానులను కలవర పెడుతుంది..అయితే అదే క్రమంలో ఈ సినిమాపై…సినిమా రిసల్ట్ పై రకరకాల టాక్స్ బయటకు వస్తున్నాయి…అద్భుత:హా అని పాజిటివ్ గా.. కాదు కాదు ఎక్కడో తేడా కొడుతుందని నెగటివ్ గా ఇలా రకరకాలుగా డివైడ్ టాక్స్ వినిపిస్తూ ఉండడంతో 11న ఏం జరగబోతుందో అన్న ఆలోచనతో ఉన్నారు మెగా ఫ్యాన్స్…అయితే ఈ కధ అంతా పక్కన పెడితే…వినిపిస్తున్న వివరాల ప్రకారం ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించబోతుంది అని తెలియకనే తెలుస్తుంది.
విషయంలోకి వెళితే…టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే…మెగాఫ్యాన్సంతా రిలాక్స్ గా ఎంజాయ్ చేసే సినిమా ఖైదీ అని తెలుస్తుంది…ఖైదీ టీమ్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…ఖైదీ నెంబర్ 150 ఔట్ పుట్ అదిరిపోయిందట, చిరంజీవి కమ్ బ్యాక్ పర్ఫెక్ట్ మూవీతో జరగబోతుందని.. మాస్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ చిరును ఎలా చూపిస్తే ఆడియెన్స్ కి కిక్ వస్తుందో అలాగే చూపించారని.. మూవీలో అన్ని హంగులు ఉండేలా చూసుకొన్నాడని.. ఎక్కడా రాజీ పడలేదంటున్నారు. అంతేకాకుండా…సినిమాలో ఏ జొనర్ ఎక్కడ మిస్ కాకుండా….చిరు స్క్రీన్ ప్రెజెన్స్.. పోసాని పంచ్ డైలాగ్స్.. అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్.. బ్రహ్మీ కామెడీ.. దేవీ మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరేలా ప్లాన్ చేశాడట వినయ్….మరి ఈ విషయాలన్నీ చూస్తుంటే రేపు 11న సినిమా ప్రభంజనం ఖాయం అని తెలుస్తుంది…చూద్దాం మరి రిసల్ట్ ఏమవుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















