మెగా 154 టైటిల్ టీజర్ అప్ డేట్..!

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్.. Mega 154.. ఈ సినిమాకి గతకొద్ది రోజులుగా “వాల్తేరు వీరయ్య” టైటిల్ ప్రచారంలో ఉంది.. కాని దీని గురించి మూవీ టీం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.. ఎట్టకేలకు చిరు 154 టైటిల్ రివీల్ చేస్తున్నామని ప్రకటించారు..

మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు టైటిల్ టీజర్ ని దీపావళి కానుకగా అక్టోబర్ 24 ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు..”ఈ దీపావళి కి మాస్ మూలవిరాట్ కి స్వాగతం.. పూనకాలు లోడింగ్.. బాస్ వస్తున్నాడు” అంటూ టీం రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది..

ఇంతకుముందు చిరు సినిమాలకు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన రాక్ స్టార్ డీఎస్పీ ఈ మాస్ సినిమా కూడా ఊరమాస్ సాంగ్స్ కంపోజ్ చేశాడట.. ఇప్పటికే షూటింగ్ తో సమానంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్ టైంలో చిరు చేసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుందని టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..

హీరో, హీరోయిన్స్ తప్ప మిగతా స్టార్ కాస్ట్ డీటెయిల్స్ వంటివి ఏమీ లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్న టీం.. టైటిల్ టీజర్ తో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కావడంతో చిరు క్యారెక్టర్ ని బాబీ పక్కా మాస్ గా డిజైన్ చేశాడని.. ఇన్నాళ్లూ చిరులో మిస్ అయిన కామెడీ, ఆయన స్టైల్ మాస్ మేనరిజమ్స్ వంటివన్నీ ఇందులో ఉంటాయని.. మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా చిరు 154 మూవీ మాంచి విందు భోజనంలా ఉంటుందని ఫిలిం నగర్ టాక్..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus