ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్న మెగాస్టార్‌

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ టీజర్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించేసింది. కాబట్టి ఆ విషయాన్ని పక్కనపెట్టేద్దాం. ఇప్పుడు మాట్లడుకోవాల్సింది. టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం చిరంజీవి అండ్‌ కో చేసిన వినూత్నమైన ప్రచారం. అవును టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం కూడా ‘ఆచార్య’ టీమ్‌ ప్రచారం చేసింది. అయితే అది ఏదో సాధారణంగా పోస్టరో, ట్వీటో చేయలేదు. సినిమా వాళ్లను మాటలతో సుతిమెత్తగా గుచ్చే మీమ్స్‌ ఉంటాయి కదా… అలానే చేసింది. సినిమాల ప్రచారంలో ఇదో కొత్త స్టయిల్‌ అనే చెప్పాలి. ఇంతకీ ఏం చేశారంటే?

చిరంజీవి సోషల్‌ మీడియాలోకి వచ్చాక… స్పీడ్‌ మామూలుగా లేదు అని గతంలోనే చెప్పుకున్నాం. కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారు చిరు. తాజాగా సోషల్‌ మీడియాలో అత్యంత ఫన్నీ అంశమైన మీమ్స్‌ను కూడా వాడుకున్నారు. ‘ఆచార్య’ గురించి నేను, కొరటాల శివ చర్చించుకున్నాం… సాయంత్రం మీకో అప్‌డేట్‌ ఇస్తా అంటూ ముందు ఓ ట్వీట్‌ పెట్టారు చిరంజీవి. ఏంటబ్బా.. ఏదన్నా వీడియో ఇస్తారా అని అందరూ అనుకుంటుండగా.. సాయంత్రానికి ఓ మీమ్‌ వచ్చింది. అది చూసి అభిమానులైతే తెగ నవ్వుకున్నారు. ఆ అనౌన్స్‌మెంట్‌ చూసి మీమ్‌ మేకర్స్‌ అయితే ‘మేం చేద్దాం’ అనుకున్న పని బాస్‌ చేసేశాడే అని నవ్వుకున్నారు.

‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను చిరంజీవి ఓ సినిమా వేడుకలో లీక్‌ (?) చేశాడనే విషయం తెలిసిందే. దీనినే మీమ్‌లో వాడుకున్నారు. ‘నువ్వు టీజర్‌ విడుదల చేస్తావా.. లేక నన్ను లీక్‌ చేసేమంటావా?’ అంటూ ఓ మీమ్‌ను సిద్ధం చేసింది చిత్రబృందం. తెలుగు సినిమాలో ఎన్నో ప్రమోషన్స్‌ చూసినా… ఇలా మీమ్‌ను ప్రచారం కోసం వాడుకోవడం ఇదే తొలిసారి. అదీ ఆ చిత్రబృందమే చేయడం విశేషం. బాస్‌ జోరు చూస్తుంటే… ‘ఆచార్య’ ప్రచారం ఇంకా చాలా కొత్త పుంతలు తొక్కేలా కనిపిస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus