మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి తన తదుపరి సినిమాలను కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే చిరంజీవి తన 156 వ సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాని గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థలో తన కుమార్తె సుస్మిత నిర్మించబోతున్నారు. చిరంజీవి 150వ సినిమా అని బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే చిరంజీవి ముందుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి అయ్యాయి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
ఇలాంటి తరుణంలో చిరంజీవి (Chiranjeevi) ముందు తన కూతురు నిర్మాణంలో వచ్చే సినిమా కాకుండా వశిష్ట దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారట. దీంతో 156 వ సినిమా కాస్త వాయిదా పడింది. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో ఇప్పటికే ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు మొత్తం వృధా అయ్యిందని అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కావడంతో కొంతమేర డబ్బు ఖర్చు పెట్టారని తెలుస్తుంది.
ఇలా ఇప్పటికే గోల్డెన్ బాక్స్ నిర్మాణం నుంచి ఈ సినిమా కోసం సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో ఈ డబ్బు కాస్త వృధానే అయ్యిందని ఇలా సినిమా ప్రారంభం కాకుండానే చిరంజీవి కుమార్తె సుస్మితకు ఏకంగా కోటి రూపాయల వరకు నష్టం వచ్చిందనీ తెలుస్తుంది. ఇక చిరంజీవి ముందుగా వశిష్ట దర్శకత్వంలో సినిమా పూర్తి చేసుకున్న తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే వీటన్నింటికీ సంబంధించి అధికారక ప్రకటన రానుంది.