Chandramukhi 2 in Telugu: చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
September 28, 2023 / 06:51 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
లారెన్స్ (Hero)
కంగనా రనౌత్ (Heroine)
మహిమా నంబియార్, వడివేలు, రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, రావు రమేష్ తదితరులు.. (Cast)
పి.వాసు (Director)
సుభాస్కరన్ (Producer)
ఎం.ఎం.కీరవాణి (Music)
ఆర్.డి.రాజశేఖర్ (Cinematography)
Release Date : సెప్టెంబర్ 28, 2023
2005లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన “చంద్రముఖి” ఎలాంటి సంచలన విజయం సాధించిందో ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. తొలుత మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనంతరం తెలుగు, తమిళ, హిందీ & కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. అన్నీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ “చంద్రముఖి 2” ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. లారెన్స్, కంగనా రనౌత్ కీలకపాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకుడు. మరి బాలీవుడ్ నటి కంగనా.. తన సీనియర్స్ అయిన శోభన, జ్యోతిక, విద్యాబాలన్, సౌందర్యల స్థాయిలో “చంద్రముఖి” పాత్రలో మెప్పించగలిగిందా? పి.వాసు మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగాడా? అనేది చూద్దాం..!!
కథ: కోటీశ్వరురాలు రంగనాయకి (రాధిక) కుటుంబం ఉన్నట్లుండి కొన్ని అవాంతరాలు, మరణాలు చవిచూడాల్సి వస్తుంది. అందుకోసం ఒక ప్రత్యేకమైన పూజ చేయాలని నిర్ణయించి.. కుటుంబం మొత్తం ఒక చోట ఉండాలని నిర్ణయించుకొని.. వెట్టయ్య ప్యాలస్ ను బసవయ్య (వడివేలు) నుంచి అద్దెకు తీసుకొని.. పూజా కార్యక్రమాలు మొదలెట్టడానికి సన్నద్ధమవుతారు.
కట్ చేస్తే.. వెట్టయ్య మహల్ లోని చంద్రముఖి కారణంగా రంగనాయకి & ఫ్యామిలీ లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులను మధన్ (లారెన్స్) ఎలా ఎదుర్కొన్నాడు? చంద్రముఖి (కంగనా రనౌత్)ని ఎలా ఎదిరించాడు? అనేది “చంద్రముఖి 2” కథాంశం.
నటీనటుల పనితీరు: ఒక కాస్ట్లీ కెమెరా ఫిక్స్ చేసి, సూపర్ కాస్ట్లీ క్యాస్టింగ్ ను ఒకింట్లో పడేసి.. బిగ్ బాస్ హౌస్ తరహాలో టాస్క్ లు ఇస్తుంటే.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుగా ఉంటుంది సినిమాలో నటీనటుల పనితీరు. లారెన్స్ కి ఇదేమీ కొత్త పాత్ర కాదు, తన స్వీయ దర్శకత్వంలోనే ఇప్పటివరకూ పదిసార్లకు పైనే నటించాడు. అందువల్ల.. పెద్దగా కష్టపడలేదు. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కంగనా రనౌత్ ఈ సినిమా ఇష్టపడి చేసిందో లేక, తప్పక చేసిందో తెలియదు కానీ..
చాలా కష్టపడి, కొన్ని చోట్ల ఇబ్బందిపడి, ఇంకొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేస్తూ ఐకానిక్ రోల్ అయిన “చంద్రముఖి”కి ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది. మహిమా నంబియార్, లక్ష్మీమీనన్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. వడివేలు కామెడీ కూడా లేకిగా ఉంది. రావురమేష్, రాధిక శరత్ కుమార్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: కీరవాణి ఒక్కడే తన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వచించాడు. నేపధ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త వహించాడు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా యావరేజ్ గా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా బిలో యావరేజ్ గా ఉంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో సి.జి వర్క్ చాలా చీప్ గా ఉంది. లైకా సంస్థ నుంచి ఈస్థాయి చీప్ వర్క్ అస్సలు ఊహించలేదు. ఇక దర్శకుడు పి.వాసు ఈ తరహా సినిమాలు ఇప్పటికే పది తీశాడు. మేకింగ్ పరంగా ఇంకా 90ల్లోనే ఉండిపోయాడు. తాను తీసిన సినిమాకి తానే స్పూఫ్ తీసినట్లుగా ఉంది “చంద్రముఖి 2”. ముఖ్యంగా కంగనా లాంటి నటితో దగ్గరుండి మరీ చేయించిన ఓవర్ యాక్షన్ సినిమాకి పెద్ద మైనస్ గా నిలిచింది.
ఇక.. సన్నివేశాలను కంపోజ్ చేసిన తీరు కూడా చౌకబారుగా ఉంది. సీనియర్ ఫిలిమ్ మేకర్ గా పి.వాసు తనకున్న గౌరవాన్ని ఈ చిత్రంతో కాస్తంత పోగొట్టుకున్నాడు. ఇప్పటికైనా ఆయన ఈ విషయాన్ని గ్రహించి ఆయన ఇమేజ్ కు తగ్గ సినిమాలు తీయడమో, లేక ఫిలిమ్ మేకర్ గా రిటైర్మెంట్ ప్రకటించడమో చేస్తే బెటర్ అనిపించేలా ఉంది “చంద్రముఖి 2” అవుట్ పుట్.
విశ్లేషణ: “చంద్రముఖి” సినిమాను థియేటర్లో లేదా టీవీలో చూసినవాళ్ళెవరూ కూడా “చంద్రముఖి 2″తో (Chandramukhi 2) సంతుష్టులవ్వలేరు. అందుకు కారణం కథ, కథనం, నటీనటుల ఓవర్ యాక్షన్ లను తట్టుకోవడం సగటు ప్రేక్షకుల తరం కాదు.
రేటింగ్: 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus