బాలయ్య పాటకి మెగా కోడలు మాస్ డ్యాన్స్!.. వైరల్ అవుతున్న వీడియో..!

‘సుగణా సుందరీ.. సుగుణా సుందరీ.. చుర చుర చూపులా రాకుమారీ’.. బాలయ్య, శృతి హాసన్ ఇద్దరూ క్లాస్ గెటప్స్‌లో, ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీసేసిన సాంగ్ ఇది.. ‘వీర సింహా రెడ్డి’ మూవీలోని ఈ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది.. థియేటర్లలో అయితే విజిల్స్ మోత మోగిపోయాయి.. ఈ పాటకు మెగా కోడలు అదిరిపోయే స్టెప్పులేసింది.. మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీకి దూరపు బంధువైన కొణిదెల పవన్ తేజ్ ప్రేక్షకలకు పరిచయమే..

గతేడాది ఆగస్టులో పాపులర్ యాంకర్ మేఘనతో పవన్ నిశ్చితార్థం జరిగింది.. పలు సినిమాలు, షోలతో గుర్తింపు తెచ్చుకున్న మేఘన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. రీసెంట్‌గా ఆమె ‘సుగుణా సుందరీ’ సాంగ్‌కి సింపుల్, స్టైలిష్ అండ్ మాస్ మూమెంట్స్ వేసిన వీడియో షేర్ చేసింది.. చక్కటి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది మేఘన..

‘‘నైస్ డ్యాన్స్.. హీరోయిన్ మెటీరియల్’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ‘జై బాలయ్య, శృతి హాసన్’ అంటూ మేఘన షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus