రవితేజ స్వభావాన్ని బయటపెట్టిన మోహరీన్‌

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం “రాజా ది గ్రేట్”. దిల్ రాజు సమర్పణలో శిరీశ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నారు. అతనికి జోడీగా మెహరీన్ నటిస్తోంది. ఆమె రవితేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ” రవితేజ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆయన ఏ విషయానికీ వణికిపోవడం, బాధపడటం నేను చూడలేదు. ఆయన సూత్రం ఒక్కటే.. జీవితంలోని ప్రతి క్షణం చెడైనా, మంచి అయినా ఎంజాయ్‌ చేయడమే.” అని వివరించారు. అందుకు ఉదాహరణగా ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

“డార్జిలింగ్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు యూనిట్‌ సభ్యులు  మొత్తం చలితో వణికిపోయారు. రవితేజ మాత్రం ఆ చలిని ఎంజాయ్‌ చేశారు. ఆ సమయంలో ‘ఇలాంటి వాతావరణం హైదరాబాద్‌లో దొరకదుగా’ అన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ ఉండాల్సి గుణం’ అని మెహరీన్ రవితేజపై ప్రశంసలు గుప్పించారు. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 12 న  థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus