మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) .. ఈ యంగ్ డైరెక్టర్ గురించి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ (Venkatadri Express) చిత్రంతో దర్శకుడిగా మారిన ఇతను తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత శర్వానంద్ తో చేసిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ (Express Raja) కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో యంగ్ హీరోలంతా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అయితే ‘కృష్ణార్జున యుద్ధం’ (Krishnarjuna Yudham) ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ (Like Share Subscribe) వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇతను రేసులో వెనుకబడ్డాడు.
నితిన్ తో చేసిన ‘మ్యాస్ట్రో’ (Maestro) ఓటీటీకి వెళ్ళింది. అది రీమేక్ సినిమా కావడంతో మేర్లపాక గాంధీకి ఎటువంటి క్రెడిట్ లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఓ మెగా హీరోతో సినిమా ఓకే చేయించుకున్నట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ తో వరుణ్ తేజ్ తో మేర్లపాక గాంధీ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. క్రైం అండ్ అడ్వంచరస్ థ్రిల్లర్ మూవీగా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలుస్తుంది.
పాన్ ఇండియా మూవీగా దీనిని మలచాలని మేర్లపాక గాంధీ భావిస్తున్నారు. వాస్తవానికి వరుణ్ తేజ్ (Varun Tej)… కరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ (Matka) అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఇది ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) పెద్ద డిజాస్టర్ అవ్వడంతో వరుణ్ తేజ్ సినిమాలకి డిమాండ్ తగ్గింది. అందుకే వరుణ్ సినిమాలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. మరి మేర్లపాక గాంధీ అయినా హిట్ ఇచ్చి అతన్ని ప్లాపుల నుండి బయటపడేస్తాడేమో చూడాలి