మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్

మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అలభిస్తుంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలందిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్.. చిన్న సినిమాలకు బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ పృద్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

రెండు నిమిషాల 14 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం సినిమాపై హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించారని స్పష్టమవుతోంది. చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ హైప్ పెంచేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus