వాల్మీకి కోసం 40 రోజులు ఒణీ కట్టుకొని షూట్ చేయడం కొత్త అనుభవం

ఇదివరకూ హీరోయిన్ అవ్వాలంటే ఆడిషన్ ఇవ్వాలి, రకరకాల ఎమోషన్స్ పలికించాలి, డైరెక్టర్ ను మెప్పించాలి ఇలా చాలా పనులుండేవి. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంటే చాలు హీరోయిన్ అయిపోవచ్చు అనేలా తయారయ్యింది పరిస్థితి. టిక్ టాక్, డబ్ స్మాష్ యాప్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్స్ అయినవాళ్ళు కోకొల్లలు. ఆ జాబితాలో తాజాగా చేసిన అమ్మాయి మృణాళిని. తమిళ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు.. “వాల్మీకి” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. బేసిగ్గా సాఫ్ట్ వేర్ ఇంజరీన్ అయిన మృణాళిని “సూపర్ డీలక్స్” సినిమాలో సహాయ పాత్రలో కనిపించింది.

అయితే.. అమ్మడు ఈ టిక్ టాక్ & డబ్ స్మాష్ వీడియోలు చేస్తున్న తరుణంలో అందరు వింతగా చూసేవారట. వీడియోల ద్వారా పాపులారిటీ బాగానే వస్తున్నప్పటికీ.. జనాలు తనను వింతగా చూడడం ఇష్టం లేని మృణాళిని రూమ్ డోర్ లాక్ చేసుకొని సీక్రేట్ గా వీడియోలు చేసేదట. అలాంటిది ఇప్పుడు అమ్మడు బిజీ హీరోయిన్ అయిపోవడం.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు కూడా వస్తుండడంతో జాబ్ మానేసి ఇప్పుడు పూర్తి దృష్టి సినిమాల మీదే పెట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus