మృణాళినికి అలా కలిసొచ్చింది.. ఏకంగా బాలీవుడ్లో కూడా ఛాన్స్..!

  • February 1, 2021 / 06:55 PM IST

వరుణ్ తేజ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గద్దలకొండ గణేష్’.పక్కా మాస్ పాత్రలో వరుణ్ తేజ్ నటించిన చిత్రమిది. తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్. ఇక ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాళిని రవి. మరో హీరో అధర్వ మురళికి జోడీగా ఈ అమ్మడు నటించింది. ‘బుజ్జమ్మ’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎంతో సహజంగా నటించి కుర్ర కారు మనసు దోచుకుంది ఈ నటి.

నిజానికి ఈ చిత్రం తరువాత మృణాళిని తెలుగులో కూడా బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.ఈమెకు ఆశించిన స్థాయిలో ఇక్కడ గుర్తింపు దక్కలేదు. కనీసం ఒక్క సినిమాలో కూడా ఈమెకు అవకాశం దక్కకపోవడంతో ఈమె పనైపోయింది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెకు మరోలా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అవును తమిళంలో మాత్రం మృణాళిని రవి.. వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.అక్కడ ఈమె ఫుల్ బిజీగా మారుతుంది.

ఇప్పుడు మృణాళిని చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఓ కన్నడ సినిమాలో కూడా నటిస్తోంది. అంతేనా అనుకోకండి.. ఏకంగా బాలీవుడ్లో కూడా ఓ సినిమా అవకాశం అందుకుంది. కోలీవుడ్లో ‘ఎంజీఆర్ మగన్’, ‘జంగో’,‘కోబ్రా’ ‘ఎనిమీ’ సినిమాల్లో నటిస్తోంది.ఇవి కనుక హిట్ అయితే… టాలీవుడ్ నుండీ కూడా ఈమెకు మళ్ళీ పిలుపొస్తుందేమో చూడాలి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus