టాలీవుడ్‌లో టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉన్నవాళ్లు ఎవరు? అనే ప్రశ్న వస్తే.. అందరూ ఠక్కున చెప్పే పేర్లు మోహన్‌బాబు – చిరంజీవి. టాలీవుడ్‌లో ప్రస్తుతం సీనియర్లు అంటే వీళ్లే అని చెప్పాలి. అలాంటి ఇద్దరి మధ్య వైరం ఉందా? అంటే ఉంది అనే అంటారు జనాలంతా. ఎందుకంటే బహిరంగ వేదిక మీద ఎన్నోసార్లు ఇద్దరూ మాటలు అనుకున్నారు. అలాగే స్నేహం ఉందా? అంటే ఉంది అనే చెబుతారు. ఎందుకంటే ఇద్దరూ ఎన్నోసార్ల బహిరంగ వేదికల మీద తమ అభిమానం చూపించుకున్నారు.
దీంతో అసలు ఇద్దరి మధ్య ఉన్నదేంటి? అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. అంతెందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్థితి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చిరంజీవి ఫ్యామిలీ సపోర్టు చేస్తే.. మరోవైపు మంచు విష్ణు బరిలోకి దిగాడు. దీంతో మా ఎన్నికలు కాస్త మెగా వర్సెస్ మంచు అయిపోయాయి. అయితే చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాల్లేవని మరోసారి స్పష్టం చేశారు నటుడు మోహన్‌బాబు. వీలు కుదిరినప్పుడల్లా మేం మాట్లాడుకుంటూనే ఉంటామని కూడా చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌బాబు ఈ విషయాలు చెప్పుకొచ్చారు. చిరంజీవితో ఏమైనా వివాదాలున్నాయా అని అడిగితే.. వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై స్పందించారు మోహన్‌బాబు. సోషల్‌మీడియాలో మా గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతం మేం సంతోషంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్యనే చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి ఆ విషయం గురించి వద్దు ఇంకేదైనా విషయం అడగండి అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు. ‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన విషయం గురించి అడిగితే.. ‘‘ఆ బాధ నా మనసులో ఉంది. అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? నా తప్పా? అనేది ఇప్పుడు చర్చించాలనుకోవడం లేదు. ఆ ఎన్నికల తర్వాత మేమిద్దరం వందసార్లు ఎదురుపడ్డాం, మాట్లాడుకున్నాం. మా మధ్య ఏమీ లేదు, బయటవాళ్లు అనుకోవడం మాత్రమే మిగిలింది’’ అని ఇంచుమించు వజ్రోత్సవాల సమాధానం లాంటిదే ఇచ్చారు మోహన్‌బాబు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?