Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు ఈ మధ్య చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. పారితోషికం కోసం కాకుండా నచ్చిన పాత్రలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటున్నారు. ఇటీవల మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేశారు. అంతకు ముందు ‘శాకుంతలం’, ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) వంటి సినిమాల్లో కూడా మెరిశారు. ఇక ఇప్పుడు ఓ సెన్సేషనల్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు అయినటువంటి ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో, మోహన్ బాబు మెయిన్ విలన్‌గా నటించబోతున్నారు.

Mohanbabu

‘ఆర్.ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఈ క్రేజీ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పిన కథ మోహన్ బాబుకు విపరీతంగా నచ్చింది అని తెలుస్తుంది. ముఖ్యంగా, అతని కోసం డిజైన్ చేసిన విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పారని టాక్. ఈ సినిమాను అక్టోబర్ 15న అధికారికంగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ నటించనుంది. ‘శ్రీనివాస మంగాపురం’ అనేది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

 ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus