కొడుకు విజయాన్నందుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది

నిజమైన పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినపుడు కాదు.. ప్రయోజకుడైనపుడు అన్న సామెత తెలిసిందే. ఇప్పుడు ఆ పుత్రోత్సాహాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తున్న వ్యక్తి చిరంజీవి. ఈ మాట అన్నది ఎవరో కాదు ఒకానొక సందర్భంలో “నాకంటే చిరంజీవి ఎందులో గొప్ప?” అంటూ ప్రశ్నించిన డాక్టర్ మంచు మోహన్ బాబు. “రంగస్థలం” రిలీజై ఘన విజయం దిశగా దూసుకుపోతున్న విధానం చూసి మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. “రంగస్థలం సినిమా నేనింకా చూడలేదు కానీ.. సినిమా గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని తెలిసింది. కొడుకు తాము ఎంచుకున్న ఫీల్డ్ లో విజయం సాధించడం కంటే తండ్రులకు గొప్ప సంతోషం మరొకటి ఉండదు. నా స్నేహితుడు చిరంజీవి తన కొడుకు ఎచీవ్ మెంట్ ను చూసి గర్వపడుతున్నాడని నమ్ముతున్నాను” అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

మంచు-మెగా ఫ్యామిలీ నడుమ వజ్రోత్సవ వేడుకల సందర్భంలో గొడవలైన విషయం తెలిసిందే. ఆ గొడవల తర్వాత ఇరు కుటుంబాలకు చెందినవారెవరూ కలిసి ఏ ఈవెంట్ లోనూ కనిపించలేదు. చిరంజీవి-మోహన్ బాబు మాత్రం చిరంజీవి షష్టిపూర్తి వేడుకల్లో కలుసుకొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ తో ఇరు కుటుంబాల నడుమ సంబంధబాంధవ్యాలు బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus