డైలాగ్ కింగ్ బెస్ట్ డైలాగ్స్

  • May 13, 2016 / 10:19 AM IST

డైలాగ్ కింగ్ మోహన్ బాబు. తన సినీ జీవితంలో నలభై వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆయన నటనతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన డైలాగులు సినిమా చూసి వచ్చినా మన చెవులో మారు మోగుతూ ఉంటాయి. మోహన్ బాబు నోట నుంచి వచ్చే ప్రతి మాట పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే ప్రపంచం లోని తెలుగు వారందరు డైలాగ్ కింగ్ ని, ఆయన డైలాగ్ ని ఇప్పటికి, ఎప్పటికి మరిచి పోలేరు.

ఈ అభిమానం ఉందనే మోహన్ బాబు తన సినిమాలలో ఉన్న మంచి మాటలను “బెస్ట్ డైలాగ్స్” అనే పేరుతో పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమింట్ లో ఆవిష్కరించారు. బ్రిటన్ లోని ఇండియా కమ్యూనిటీ వ్యక్తికి చెందిన ఓ వార్త పత్రిక పదో వార్షికోస్తవం సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్య క్రమంలో మోహన్ బాబు భార్య నిర్మల, కొడుకులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మి పాల్గొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus