ఇంద్రగంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమా?

  • September 16, 2022 / 04:12 PM IST

మోహనకృష్ణ ఇంద్రగంటి.. ఇతని సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంటుంది. చూడటానికి సాధారణంగానే కనిపించినా.. ఎక్కడో మనుషుల మనసుల్ని మెలితిప్పే భావం ఉంటుంది. అందుకే తెలుగు దర్శకుల యందు మోహనకృష్ణ వేరయా అంటుంటారు. ఆయన ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమ మీదే సినిమాలు చేస్తున్నారు. ‘సమ్మోహనం’ అలాంటి సినిమానే, ఇప్పుడు విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా అలాంటిదే. అంతేకాదు నెక్స్ట్‌ సినిమాల్లో ఒకటి మళ్లీ సినిమా బ్యాక్‌డ్రాప్‌లోనే అంటున్నారు. అంతే కాదు. అది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అట.

మోహనకృష్ణ ఇంద్రగంటి తర్వాతి సినిమాల గురించి ఇటీవల సుధీర్‌బాబు మాట్లాడారు. ‘తర్వాతి సినిమా కూడా సినిమా నేపథ్యమే అంటున్నారు. మీకు కథ చెప్పారా?’ అని సుధీర్‌బాబును అడిగితే.. అసలు విషయం తెలిసింది. ‘‘ఆ కథని నాకు కూడా చూచాయగా చెప్పారు. నాయికా ప్రధానంగా రాసుకున్నానని కూడా ఆయన ఓ క్లూ ఇచ్చారు. అయితే ఆ సినిమాను ఆయన ఇప్పట్లో తీయరు. దానికి ఇంకా చాలా సమయం పడుతుంది’’ అని చెప్పారు సుధీర్‌బాబు.

అంతేకాదు మోహనకృష్ణ ఇంద్రగంటి దగ్గర.. ఇంకా వేరే జోనర్స్‌లో రాసిన మంచి మంచి కథలు ఉన్నాయట. నెక్స్ట్‌ సినిమా వాటిలో ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పారు సుధీర్‌బాబు. దీంతో ఇప్పుడు ఇంద్రగంటి చెప్పబోతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా ఏంటి? అనే ప్రశ్న టాలీవుడ్‌లో మొదలైంది. సినిమా రంగంలో కన్నీటి కోణాల్ని గతంలో కొంతమంది దర్శకులు చూపించారు. వాటికి అప్పుడు మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పుడు మరి ఇంద్రగంటి ఏం చూపిస్తారు అనేది తెలియాలి.

టాలీవుడ్‌ అంతెత్తుకు ఎదిగి.. అమాంతం పడిపోయిన నాయికలు చాలామందే ఉన్నారు. అలాగే ఎవరికీ సాధ్యం కాని అందలాలు అందుకుని దూసుకుపోతున్న నాయికలూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంద్రగంటి ఎవరి కథను తీసుకుంటారు అనే ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా జీవిత కథగా ఉంటుందా? లేక ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితిని చెప్పేలా ఉంటుందా అనేది చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus