Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

రెండేళ్ల క్రితం.. ఓ స్టార్‌ హీరో వారసుడిని రిలీజ్‌ చేస్తూ టాలీవుడ్‌ యూనివర్స్‌ క్రియేటర్‌ ప్రశాంత్‌ వర్మ భారీ స్థాయిలో ఓ పంచ్‌ లైన్‌తో సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇదిగో, అదిగో ఓపెనింగ్‌ అంటూ కొన్ని నెలలు వెయిట్‌ చేయించి.. ఇక ఆ సినిమా లేదు అని చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలో ఓ డెన్‌ నుండి సింహం కూనను బయటకు తీసుకొస్తున్నట్లు చూపించారు. ఇక్కడ సింహం బాలకృష్ణ.. కూన మోక్షజ్ఞ (Mokshagna) అని చెప్పొచ్చు.

Mokshagna, Prasanth Varma

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. అప్పుడు ఇచ్చిన పంచ్‌ లైన్‌, పోస్టర్‌కి దగ్గరగానే ఇప్పుడు మోక్షజ్ఞ కొత్త తొలి సినిమా అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా రాసిన టెక్స్ట్‌ ఉంది. ఒక విధంగా ఇది పాత తొలి సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మకు కౌంటర్‌లా కనిపిస్తోంది. ఇదంతా చెప్పడానికి ముందు మోక్షజ్ఞ (Mokshagna) పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేసిన అప్‌డేట్‌ సంగతి చూద్దాం. ‘బింబిసార’ సినిమా ఫేమ్‌ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ మేరకు బాలకృష్ణ, మోక్షజ్ఞ, (Mokshagna) వశిష్ఠ, నవీన్‌ ఎర్నేని కలసి ఉన్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అప్పుడు ‘‘కూన గుహను వీడింది. సింహంలా అడవిలోకి అడుగు పెట్టింది’ అంటూ ఆ ఫొటోల కింద రాసుకొచ్చారు. అతి త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతామని చెప్పారు. విజయదశమి సందర్భంగా సినిమాను ప్రారంభించాలని బాలయ్య నిర్ణయించుకున్నారట.

అప్పుడు కూనగా మోక్షజ్ఞను చూపించిన ప్రశాంత్‌ వర్మకు రియాక్షన్‌ ఇచ్చేలా.. ఇప్పుడు మోక్షజ్ఞ కూన కాదు.. యంగ్‌ సింహం అని చెప్పకనే చెప్పారు. ఇక సరైన కథ పట్టుకుని లాంచింగ్‌ భారీగా ఉండేలా చూసుకోవాలి. తొలి అడుగు తొలి అడుగు దగ్గరే ఆగిపోయిన మోక్షజ్ఞ.. ఇప్పుడు సరికొత్తగా తొలి అడుగు వేసి త్వరగా ప్రేక్షకుల్ని అలరించేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus