2017 లో ఆకట్టుకోలేని సినిమాలు

‘టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కయినట్టు..’.. అయినట్టు ఏమిటి? తెలుగు ప్రేక్షకులు కొన్ని సినిమాల విషయంలో పూర్తిగా బుక్కయ్యారు. థియేటర్ లో రెండున్నర గంటలు కూర్చోవడం కష్టంగా ఫీలయ్యారు. “వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా ” అంటూ హీరోలను, డైరెక్టర్లను తిట్టుకుంటూ థియేటర్ నుంచి బయటికి వచ్చారు. 2017 లో నిరాశపరిచిన సినిమాలపై ఫోకస్..

విన్నర్ వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో తిక్క మూవీతో సాయి ధరమ్ తేజ్ కి బ్రేక్ పడింది. ఆ సినిమా అపజయంతో గుణపాఠం నేర్చుకొని చేసిన సినిమా విన్నర్. పైగా ఇందులో లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. తప్పకుండా ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని భావించి థియేటర్ కి వెళ్లిన వారు.. సినిమా చూసి అలసి పోయి బయటికి వచ్చారు.

రోగ్ ఇడియట్.. పోకిరి.. వంటి చెడ్డ పేర్లతో మంచి హిట్ అందుకున్నారు డైరక్టర్ పూరి జగన్నాథ్. అందుకే అతను ఇలాంటి పేరు పెడితే ఆ సినిమా హిట్ అని ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకంతోనే కొత్త హీరో ఇషాన్ నటించినప్పటికీ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అంతే భారీగా ప్రేక్షకులకు తలనొప్పి వచ్చింది.

మిస్టర్ శ్రీను వైట్ల.. దూకుడు తో టాప్ డైరక్టర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత అతని మ్యాజిక్ లేదు. కానీ వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అని అనుకున్నారు. సినిమా పూర్తి కాక ముందే థియేటర్ నుంచి బయటికి వచ్చారు.

ఖయ్యుమ్ భాయ్ పోలీసులను గడగడలాడించిన నయీమ్ హత్య అనంతరం.. అతని గురించి తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకే అతని లైఫ్ హిస్టరీ ఇదేనంటూ ఖయ్యుమ్ భాయ్ సినిమా వచ్చింది. ఎంతో ఆసక్తిగా సినిమాకి వెళ్లిన వారు.. ఆ సినిమాలోని నటీనటుల యాక్టింగ్ భరించలేక నీరసంతో బయటికి వచ్చారు.

నక్షత్రం కృష్ణవంశీ నుంచి మళ్ళీ ఓ ఆణిముత్యం లాంటి సినిమా వస్తుందని నక్షత్రం టీజర్ చూసిన తర్వాత అందరూ అనుకున్నారు. సందీప్ కిషన్, ప్రగ్యా, రెజినా, సాయి ధరమ్ తేజ్ లు ఎంత కష్టపడినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

శ్రీ వల్లిబాహుబలి సినిమాతో విజయేంద్ర ప్రసాద్ కి అభిమానులు పెరిగారు. రాజమౌళితో సమానంగా అతని గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. అటువంటి రచయిత డైరక్టర్ గా చేసిన చిత్రం శ్రీ వల్లి. సినిమా మొదలు అయినప్పటి నుంచి కథ ఏంటో అర్ధంకాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.

స్నేహమేరా జీవితం శివ బాలాజీ ఈ ఏడాది బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అతను, రాజీవ్ తో కలిసి చేసిన మూవీ “స్నేహమేరా జీవితం”. 80 వ దశకంలో జరిగిన ఈ కథ ప్రేక్షకులను బోర్ కొట్టించింది.

అత్యధికమంది బాగాలేదని చెప్పిన సినిమాలను మాత్రమే ఈ జాబితాలో చేర్చాము. ఇది ఏ ఒక్కరి అభిప్రాయం కాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus