ప్లాప్ సినిమాలు కూడా యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి..!

అప్పట్లో ఓ సినిమా రేంజ్ గురించి చెప్పాలంటే 100 రోజులు, 175 రోజులు అంటూ చెప్పుకునే వారు. తరువాత కొన్నాళ్ళకు 50 సెంటర్లు, 100 సెంటర్లు అంటూ చెప్పుకునే వారు. ఇక దాని తరువాత 50 కోట్లు,100 కోట్లు అంటూ కలెక్షన్లను బట్టి సినిమా రేంజ్ డిసైడ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ డే గ్రాస్ ఇంత… ఫస్ట్ వీక్ గ్రాస్ … 10 డేస్ గ్రాస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ట్రెండ్ మొదలయ్యింది. అదే… యూట్యూబ్ లో ఏ చిత్రానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ నీయాంశమయ్యింది. అసలు రిలీజయ్యే సినిమా హిట్.. ప్లాప్ అనేది పక్కన పెడితే.. యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ఒక రికార్డు గా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం పై సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. గత రెండు రోజుల్లో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం -డీజె’ చిత్రం యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఇంకో విషయం ఏమిటంటే… ఈ చిత్రం హిందీ వెర్షన్ కి 72 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇక యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన చిత్రాల వివరాలు :

1.’దువ్వాడ జగన్నాధం -డీజె’ – 50 మిలియన్ వ్యూస్

2. నేను లోకల్ – 50 మిలియన్ వ్యూస్

3. ‘శ్రీమంతుడు’ – 50 మిలియన్ వ్యూస్

4. శతమానం భవతి – 38 మిలియన్ వ్యూస్

5. ఫిదా – 35 మిలియన్ వ్యూస్

6. రారండోయ్ వేడుక చూద్దాం – 30 మిలియన్ వ్యూస్

7. గోవిందుడు అందరివాడేలే – 26 మిలియన్ వ్యూస్

8. బ్రూస్ లీ – 26 మిలియన్ వ్యూస్

9.బ్రహ్మోత్సవం – 21 మిలియన్ వ్యూస్

10. జనతా గ్యారేజ్ – 20 మిలియన్ వ్యూస్

11.ఖాకీ – 19 మిలియన్ వ్యూస్

12.నాయక్ – 18 మిలియన్ వ్యూస్

13. మిర్చి – 18 మిలియన్ వ్యూస్

14. మగధీర – 18 మిలియన్ వ్యూస్

15. లెజెండ్ – 17 మిలియన్ వ్యూస్


16. టెంపర్ – 16 మిలియన్ వ్యూస్


17. రెబల్ – 15 మిలియన్ వ్యూస్


18. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ – 15 మిలియన్ వ్యూస్


19. బిల్లా – 15 మిలియన్ వ్యూస్


20. రామయ్యా వస్తావయ్యా – 13 మిలియన్ వ్యూస


21. ఆగడు – 13 మిలియన్ వ్యూస్


22.గుండె జారి గల్లంతయ్యిందే – 12 మిలియన్ వ్యూస్


23. అత్తారింటికి దారేది – 12 మిలియన్ వ్యూస్


24. గబ్బర్ సింగ్ – 10 మిలియన్ వ్యూస్


25. అరుంధతి – 10 మిలియన్ వ్యూస్

పెద్ద హీరోల సినిమాలకు ఎలాగూ వ్యూస్ వస్తాయనుకుంటే… చిన్న హీరోల చిత్రాలకు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి. శ్రీ విష్ణు,సుధీర్ బాబు, నారా రోహిత్ వంటి హీరోల చిత్రాలకి కూడా మిలియన్ వ్యూస్ వస్తుండడం విశేషం. భవిష్యత్తులో చిన్న హీరోల సినిమాలు యూట్యూబ్ నుండే బాగా సెన్సేషన్ క్రియేట్ చేసినా.. ఆశ్చర్యపడనవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus