‘బిగ్ బాస్4’ మొదలయ్యి నెల రోజులు పూర్తయ్యింది.ఈసారి కూడా షోకి టి.ఆర్.పి రేటింగ్ మంచిగా వస్తుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వంటి కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ‘బిగ్ బాస్’ కూడా టాస్కులను టఫ్ చేస్తున్నాడు. దాంతో హౌస్ మేట్స్ మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇక నామినేషన్స్ టైములో అయితే చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకూ చూసిన ఎపిసోడ్స్ ను బట్టి.. హౌస్ మేట్స్ ప్రవర్తన ఎలాంటిదో ప్రేక్షకులందరికీ ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది. రోజూ సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తే ఈ విషయం క్లియర్ గా స్పష్టమవుతుంది.
సరే..మన హౌస్ మేట్స్ ప్రవర్తనను ఆధారం చేసుకుని.. వాళ్లకు ఏ సినిమా టైటిల్స్ కరెక్ట్ సూట్ అవుతాయో ఓ చిన్న ప్రయోగం చేసాం..! అయితే ఇది ఇప్పటి వరకూ మనం చూస్తూ వచ్చిన ‘బిగ్ బాస్4’ ఎపిసోడ్స్ ను ఆధారం చేసుకుని మాత్రమే.రాబోయే ఎపిసోడ్స్ లో వీళ్ళ ప్రవర్తన మారొచ్చు కూడా..! ఒకవేళ ఈ టైటిల్స్ కనుక మ్యాచ్ అవ్వలేదు అని మీకు అనిపిస్తే… ఏ టైటిల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక మన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లకు మేమిచ్చిన టైటిల్స్ ఓ లుక్కెయ్యండి :
1) నువ్వా నేనా : అఖిల్ -మోనాల్ – అభిజీత్
వీళ్ళ ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఏదో జరుగుతుంది.. కానీ అది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.అందుకే ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది.
2) గోపి (గోడ మీద పిల్లి) : మోనాల్
ఈమె ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. కొంచెం కన్నింగ్, అమాయకత్వం.. అన్నట్టు కనిపించినా గేమ్ మాత్రం బాగానే ఆడుతుంది.
3) అపరిచితుడు : అభిజీత్ (ఒక రామానుజన్, ఒక రెమో, ఒక అపరిచితుడు)
రామానుజన్ లాగా రూల్స్ ఫాలో అవుతూ గేమ్ ఆడతాడు, రెమో లాగా మోనాల్, హారిక,దివి లతో క్లోజ్ గా ఉంటాడు. కోపం వస్తే మాత్రం అపరిచితుడే..!
4) ఇద్దరు మిత్రులు : లాస్య – సుజాత
ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. అందుకే ఈ టైటిల్.
5) అర్జున్ రెడ్డి : మెహబూబ్ దిల్ సే
ఈయనకి కోపం వస్తే ఎలా ఉంటుందో.. హ్యూమన్స్ – రోబోట్స్ టాస్క్ లో చూసాం కదా..! ‘ఆడ పిల్లలతో గేమ్స్ ఏంటి రా మైదా పిండి’.
6) మర్యాద రామన్న : అమ్మ రాజశేఖర్
అందరితోనూ మంచిగా ఉంటాడు.. అందరినీ నవ్విస్తూ ఉంటాడు.
7) సుడిగాడు : ముక్కు అవినాష్
సుడిగాలిలా హౌస్ అంతా తిరిగి మరీ ఎంటర్టైన్ చేస్తుంటాడు.
8) ఓ మై ఫ్రెండ్ : హారిక – అభిజీత్
లాస్య, సుజాత ల తరువాత హౌస్లో మంచి ఫ్రెండ్స్ అంటే వీళ్ళే..!
9) భానుమతి(ఫిదా) – దివి
మన దివి పాపది ఓ ప్రత్యేకమైన శైలి.. హౌస్ లో ఎవ్వరితోనూ కలవదు.. ఈమెను కూడా హౌస్మేట్స్ సెపరేట్ గా చూస్తారు. అందుకే ఒక్కటే పీస్ .. హైబ్రిడ్ పిల్ల..!
10) జేజెమ్మ(అరుంధతి) – గంగవ్వ
హౌస్లో అందరూ ఈమెను ఇష్టపడతారు .. అలాగే ఈమెకు భయపడతారు కూడా. అందుకే ఈ టైటిల్..!