ఇండస్ట్రీ బంద్ కారణంగా మూడు వారాల నుంచి సరైన సినిమాలు లేవు, గతవారం కూడా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ రిలీజ్ అవ్వలేదు. దాంతో మూవీ లవర్స్ కి హిందీ లేదా ఇతర భాషా సినిమాలే దిక్కయ్యాయి. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఈ శుక్రవారం సినిమాల లిస్ట్ కాస్త ఆసక్తికరంగా ఉంది. తెలుగు, హిందీ కలిపి మొత్తం ఏడు సినిమాలు విడుదలవుతుండగా.. రెండు ఆంగ్ల చిత్రాలు విడుదలవుతున్నాయి.
నిఖిల్ నటించిన “కిరాక్ పార్టీ”, నయనతార ప్రధాన పాత్ర పోషించిన “కర్తవ్యం”, దండుపాళ్యం సిరీస్ లో వచ్చిన మూడో చిత్రమైన “దండుపాళ్యం 3″తోపాటు “ఐతే 2.0, వాడేనా” అనే రెండు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. హిందీలో “రెయిడ్, కుత్తే కి దమ్” చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండు ఆంగ్ల చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ.. అవి ఎవరికీ పెద్దగా తెలియవు. సో, ఈ వారం ఏడు సినిమాలతో మూవీ లవర్స్ కి పండగే.
ఇకపోతే.. ఆల్రెడీ “కర్తవ్యం” ప్రీమియర్ షోల నుండి విపరీతమైన పాజిటివ్ టాక్ సంపాదించుకోగా “కిరాక్ పార్టీ” మీద మాత్రం పెద్ద బజ్ లేదు, ఇక “దండుపాళ్యం 3” కోసం ఒక సెక్షన్ ఆడియన్స్ తప్ప ఎవరూ పెద్దగా వెయిట్ చేయడం లేదు. ఇక హిందీ చిత్రం “రెయిడ్” మీద జనాలు ఎక్కువగా హోప్స్ పెట్టుకోలేదు. మరో చిత్రం “కుత్తే కి దమ్” మీద మాత్రం సినిమా అభిమానులకు భారీ అంచనాలున్నాయి.