Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

ఒక పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు.. ఆ తర్వాత తరం హీరోలు, చిన్న హీరోల సినిమాలు పక్కకు తప్పుకోవాల్సిందే. ఇదేమీ రూల్‌ కాదు. కానీ థియేటర్లు దొరకవు/ చాలవు. ఒకవేళ కొన్ని థియేటర్లు దొరికినా ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో వస్తారా అనేది డౌటే. ఈ కారణాల వల్ల సినిమాలు పక్కకు తప్పుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి టాలీవుడ్‌లో చాలా సందర్భాల్లో చూశాం. మన దగ్గరంటే పెద్ద సినిమాలు వాయిదాలు పడీ, పడీ ఎప్పటికో వస్తుంటాయి కాబట్టి.. ఇక్క చాలా సార్లు చూశాం.

Jana Nayagan

కానీ కోలీవుడ్‌లో ఇలా పెద్ద సినిమాలు వాయిదాలు పడీ పడీ హఠాత్తుగా వచ్చే సందర్భాలు తక్కువ. కానీ ఇప్పుడు అలా వచ్చింది ‘జన నాయగన్‌’. ఈ సినిమాను జులై 24న విడుదల చేస్తారని సమాచారం. సినిమా టీమ్‌ నుండి ఎక్కడా అధికారిక ప్రకటన లేదు కానీ.. వారి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు సమాచారం అయితే ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆ డేట్‌, ఆ తర్వాత వారం సినిమాలు రిలీజ్‌ చేద్దాం అనుకున్నవాళ్లు ఇప్పుడు కొత్త డేట్స్‌ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అలాంటి సినిమాలు ఏంటా అని చూస్తే.. టాలీవుడ్‌ నుండి ఒకే ఒక్క సినిమా ఉంది. అదే ‘చెన్నై లవ్‌ స్టోరీ’. మన దగ్గర విజయ్‌ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వరుగా.. ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాకు వచ్చే ఇబ్బందేంటి అనుకుటున్నారా? ఇబ్బంది మన దగ్గర కాదు కోలీవుడ్‌లో. ఈ సినిమా హీరోయిన్‌ శ్రీ గౌరీ ప్రియకు తమిళనాట మంచి క్రేజ్‌ ఉంది. (ఆమె తమిళ సినిమాలు చేసిందిగా) దాన్ని క్యాష్‌ చేసుకునేలా ఈ సినిమాను తమిళంలోనూ రిలీజ్‌ చేస్తున్నారు. మరిప్పుడు అక్కడ థియేటర్లు దొరికే ఛాన్స్‌ తగ్గిపోయింది.

ఇక తమిళ పరిశ్రమలో చూస్తే.. 23న విడుదల కావాల్సిన జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ సినిమాను వాయిదా వేస్తున్నారట. అలాగే 31న విడుదల చేయడానికి రెడీ చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌ ‘డీసీ2, సందీప్‌ కిషన్‌ ‘సిగ్మా’ కూడా వేరే డేట్స్‌ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కొడుకు సినిమా కూడా ఇబ్బందుల్లోనే పడుతుందన్నమాట. కొడుకేంటి అనుకుంటున్నారా.. ‘సిగ్మా’ దర్శకుడు విజయ్‌ తనయడు జేనన్‌ సంజయ్‌నే కదా.

 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus