పాట రిలీజ్ చేయడం, దానికి నెటిజన్ల నుండి కామెంట్ల వేడి కాస్త తగలడంతో ‘మిస్టర్ బచ్చన్’ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అయితే ఈసారి విషయం ట్రోలింగ్ కాదు, దానికి రిప్లై కూడా కాదు. ఈసారి ఇష్యూ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ఆగమనం ఎప్పుడు అని. అవును ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రవితేజ (Ravi Teja) , హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’.
ఈ సినిమా ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టినా విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. ఆగస్ట్ 15 అని సినిమా టీమ్ అంటున్నా.. నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంకా తేదీ విషయంలో ఆలోచనలు, చర్చలు అవ్వలేదని, త్వరలో తేలుతుంది అని అంటున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, లాంగ్ వీకెండ్ కారణంగా ఆగస్టు 15 అయితే బెటర్ అని అంటున్నారు.
అయితే ఇప్పటికే ఆ తేదీని రామ్ (Ram) – పూరి (Puri Jagannadh) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart), గీత ఆర్ట్స్ 2 – నార్నె నితిన్ (Narne Nithin) ‘ఆయ్’ (AAY) , నివేదా థామస్ (Nivetha Thomas) ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) లాంటి సినిమాలు ఆ డేట్‌కు ఫిక్స్ అయ్యాయి. దీంతో ఆ రోజుకు ‘మిస్టర్ బచ్చన్’ బరిలోకి దిగుతాడా అనేదే ప్రశ్న. ఒకవేళ ఆ టైమ్ కాదు అంటే.. ఆగస్టులో ఆఖరి రెండు వారాలు చూద్దాం అంటే అన్ సీజన్ ఎఫెక్ట్ పడుతుంది.
ఈ లెక్కన సెప్టెంబర్‌కు వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. అయితే అల్లరి నరేష్ (Allari Naresh) ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) బరిలో ఉన్నాయి. ఇక పవన్ (Pawan Kalyan) ‘ఓజీ’ (OG) వదిలేసిన సెప్టెంబరు 27ను తారక్ (Jr NTR) – కొరటాల (Koratala Siva) ‘దేవర’ (Devara) తీసుకుంది. కాబట్టి దానికి ఆఖరి వారం ఎవరూ రారు. మరి ‘మిస్టర్ బచ్చన్’ను ఎప్పుడు బరిలోకి దింపుతారో చూడాలి.