Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 15, 2026 / 01:58 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • త్రిగుణ్ (Hero)
  • పాయల్ రాధాకృష్ణ (Heroine)
  • అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్ త‌దిత‌రులు (Cast)
  • మధుదీప్ చెలికాని (Director)
  • అరవింద్ మండ్యం (Producer)
  • ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు (Music)
  • రవికుమార్ వి (Cinematography)
  • కోటగిరి వెంకటేశ్వరరావు (Editor)
  • Release Date : 15th మే 2026
  • లోటస్ క్రియేటివ్ వర్క్స్ (Banner)

త్రిగుణ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించిన మూవీ “మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌”. మ‌ధుదీప్ చెలికాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను అర‌వింద్ మండ్యం నిర్మించారు. మెసేజ్ ఓరియెంటెడ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన “మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌” శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ చిన్న సినిమా ఎలా ఉంది? త్రిగుణ్‌తో పాటు పాయ‌ల్ రాధాకృష్ణకు ఈ మూవీతోనైనా హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Mr. Work From Home Movie Review

Mr. Work From Home Movie Review and Rating

క‌థ‌: అరవింద్ (త్రిగుణ్‌) అమెరికా లో నాలుగేళ్లు జాబ్ చేసి వ్యవసాయం చేయాల‌నే ఆలోచ‌న‌తో ఇండియా కు వస్తాడు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండే మహీ (పాయ‌ల్ రాధాకృష్ణ‌) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తనను పెళ్లి చేసుకోబోయే వాడు అందంగా లేక పోయిన ప‌ర్వాలేదు…కానీ మంచి జాబ్ చేసే వాడు కావాలని కలలు కంటుంది మహీ. అరవింద్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని, వారికిబాగా ఆస్తి ఉందని అపోహ ప‌డిన మ‌హీ అతడిని ఇష్టపడుతుంది సెక్యూరిటీ, ఆస్తిపాస్తులు చూసుకొనే ప్రేమ‌…అస‌లు ప్రేమే కాద‌ని అరవింద్ వాదిస్తాడు. ఇద్దరు గొడవలు పడి విడి పోతారు. ఆ తర్వాత ఏమైంది? రైతుల దగ్గర నుండి భూమిని తీసుకొని మిల్లెట్స్ పండించాల‌నుకున్న అర‌వింద్ ఎలాంటి క‌ష్టాలు అనుభ‌వించాడు? మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అర‌వింద్ డెవ‌ల‌ప్ చేసిన యాప్ ఫేమ‌స్ అయ్యిందా? అర‌వింద్‌ను అత‌డి తండ్రి (అనీష్ కురివిల్లా) ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ల‌గొట్టాడు? అర‌వింద్‌కు సాయం చేసిన బ‌ల‌రాం చ‌క్ర‌వ‌ర్తి (శివాజీ రాజా) ఎవ‌రు? అర‌వింద్ ప్రేమ‌, అత‌డి నిజాయితీని మ‌హీ అర్థం చేసుకుందా? లేదా అన్న‌దే మిగిలిన క‌థ‌.

Mr. Work From Home Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: మంచి స‌క్సెస్ కోసం త్రిగుణ్ చాలా ఏళ్లుగా దండ‌యాత్ర‌లు చేస్తూనే ఉన్నాడు. స‌రైన క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలోనే ఫెయిల‌వుతున్నాడు. ఈ సినిమాతోనూ అదే త‌ప్పు చేశాడు. త‌న వ‌ర‌కు బాగానే చేశాడు. పాయ‌ల్ రాధాకృష్ణ యాక్టింగ్ టాలెంట్, గ్లామ‌ర్ రెండింటిని చూపించే ఛాన్స్ రాలేదు. అనీష్ కురివిల్లా, స‌త్య కృష్ణ పాత్ర‌లు రొటీన్‌. సుద‌ర్శ‌న్, వైవా హ‌ర్ష కామెడీ పూర్తిగా తేలిపోయింది. స్టార్ హీరోల రిఫ‌రెన్స్‌లు బాగానే వాడారు. కానీ వాటితో ప‌న‌వ్వ‌లేదు.

Mr. Work From Home Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: రైట‌ర్‌గా మ‌ధుదీప్ ప‌ర్వాలేద‌నిపించారు. కానీ డైరెక్ట‌ర్‌గా ఫెయిల‌య్యాడు. జెన్‌జీ ట్రెండ్‌గా త‌గ్గ‌ట్లుగా సినిమాను తెర‌కెక్కించ‌డంలో త‌డ‌బ‌డిపోయాడు. ప్ర‌కాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు పాట‌లు సినిమా నిడివిని పెంచ‌డానికే ఉప‌యోగ‌ప‌డ్డాయి. ర‌వికుమార్ సినిమాటోగ్ర‌ఫీ కూడా సోసోగానే ఉంది. నిర్మాణ విలువ‌లు కూడా యావ‌రేజ్‌గానే ఉన్నాయి.

Mr. Work From Home Movie Review and Rating

విశ్లేష‌ణ‌: దేశానికి రైతే రాజు అని అంటుంటారు. కానీ వాస్త‌వానికి రైతు ఎప్ప‌టికీ రాజు కాలేదు. క‌నీసం రైతులా కూడా బ‌త‌క‌డం నేటి ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మైపోయింద‌నే మెసేజ్ తో నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లుగా ల‌వ్‌స్టోరీ జోడించి మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు మ‌ధుదీప్‌. వ్య‌వ‌సాయం చేయ‌డానికి యువ‌త ముందుకు రావాల‌ని, ఆధునిక టెక్నాల‌జీని వాడుకుంటూ వ్య‌వ‌సాయం చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్‌ల‌కు మించి సంపాదించ‌వ‌చ్చ‌ని చూపించాల‌ని అనుకున్నారు. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న మంచిదే. కానీ చెప్పిన విధాన‌మే చాలా గ‌జిబిజీగా ఉంది. ప్రారంభంలోనే ద‌ర్శ‌కుడు ట్రాక్ త‌ప్ప‌డంతో ఎక్క‌డో మొద‌లై సినిమా ఎటెటో వెళ్లిపోతుంది. వ్య‌వ‌సాయం, ప్రేమ‌క‌థ…ఈ రెండింటికి క‌నెక్ష‌న్ స‌రిగ్గా కుద‌ర‌లేదు. పోనీ ఆ ప్రేమ‌క‌థ‌ను అయినా స‌రిగ్గా రాసుకున్నాడా అంటే అదీ లేదు.

భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన ఓ జంట ప్రేమ‌క‌థ‌లో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయ‌న్న‌ది చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు చాలా క‌న్ఫ్యూజ్ అయ్యాడు. భ‌లేగా రాశాడే అని ఆడియెన్స్ ఫీల‌య్యే స‌న్నివేశం సినిమాలో ఒక్క‌టి క‌నిపించ‌దు. డ్రామా, ల‌వ్, సెంటిమెంట్‌, కామెడీ….ఏ ఎమోష‌న్ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు. స్క్రీన్‌పై సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, గుండు సుద‌ర్శ‌న్ కామెడీ పేరుతో నానా జిమ్మిక్కులు చేస్తారు. ఒక్క సీన్‌కు న‌వ్వురాదు…ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మైన‌స్‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.

సినిమా ర‌న్ టైమ్ రెండు గంట‌ల తొమ్మిది నిమిషాలే. కానీ మూడు గంట‌ల సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఐదారేళ్ల క్రితం సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ చేసిన‌ట్లుగా అనిపిస్తుంది.

Mr. Work From Home Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: మిస్ట‌ర్ వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్‌ను స్కిప్ చేయ‌డ‌మే బెట‌ర్‌. టైటిలే కొత్త‌ది…సినిమా మాత్రం పాత‌ది

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mr. Work From Home Movie
  • #Payal Radhakrishna
  • #Thrigun

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

5 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

8 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

13 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 day ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version