Mrunal Thakur: కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్‌… ఏమందంటే?

కెరీర్‌ ప్రారంభించి కొన్నాళ్లు అయిన తర్వాత టాలీవుడ్‌లోకి ప్రవేశించింది మృణాల్‌ ఠాకూర్‌. మరాఠీ, హిందీ సినిమాలు చేసిన తర్వాత సుమారు 8 ఏళ్లకు 2022లో తెలుగులోకి వచ్చింది. ఇతర ఇండస్ట్రీల్లో ఎంత పేరు తెచ్చుకుందో తెలియదు కానీ… తెలుగులో మాత్రం రావడం రావడంతోనే అదిరిపోయే పేరు సంపాదించుకుంది. ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్‌కి వచ్చిన ఈ అందం సీతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఆ తర్వాత ఒకే తరహా పాత్రలకు స్టిక్‌ అవ్వకుండా రకరకాల పాత్రలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

అలాంటి పాత్రలే వస్తున్నాయి కూడా. అయితే తాజాగా ఆమె తన కెరీర్‌ గురించి చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తెలుగులో వైవిధ్యభరితంగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌ ఆ పాత్రల పేర్లతోనే ప్రేక్షకుల గుర్తుండిపోతోంది. దీంతో కథలు, పాత్రల ఎంపిక విషయంలో మీకు స్ఫూర్తినిచ్చే అంశాలేంటి? అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నటిగా ముఖానికి రంగేసుకున్నప్పటి నుండి నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే. మృణాల్‌గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకోకపోయినా నా పాత్రలతో గుర్తుండిపోవాలి.

అందుకే కథలు, పాత్రల ఎంపికలో ఆ విషయాన్నే పట్టించుకుంటాను. అందుకే ‘సీతారామం’ సినిమాతో సీతగా పేరు తెచ్చుకుంటే, ఆ తర్వాత ‘హాయ్‌ నాన్న’ సినిమాలో యష్నగా గుర్తుండిపోవాలనుకున్నాను. అందుకే ఆ కథలు, పాత్రలు ఎంచుకున్నాను అని చెప్పింది మృణాల్‌. వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్లు ఓకే చేయడం తనకు నచ్చదని… మంచి పాత్రను వెతికి పట్టుకోవడం కోసం సహనంతో ఎదురు చూస్తుంటాను అని చెప్పిన మృణాల్‌…

తొందరపడి ఏది పడితే అది చేయను అని చెప్పింది. ఇక మృణాల్‌ (Mrunal Thakur) లైనప్‌ సంగతి చూస్తే… తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీస్టార్‌’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది అని అంటున్నారు. ఇది కాకుండా తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తోందని టాక్‌. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. దీంతోపాటు హిందీలోనూ ఓ సినిమా చేస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus