Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు వంటి నటీనటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండోరా'(Dhandoraa). ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వహించిన సినిమా ఇది.’కలర్ ఫోటో’ తో నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న ‘లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మధ్యలో వీళ్ళు నిర్మించిన ‘బెదురులంక 2012’ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

Dhandoraa First Review

ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘దండోరా’ టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలకి చూపించారు మేకర్స్.సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

కులం, చావు వంటి 2 సెన్సిటివ్ అంశాలు తీసుకుని.. ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా, ఆలోజింపజేసేలా ‘దండోరా’ని దర్శకుడు మురళీకృష్ణ తీర్చిదిద్దినట్టు సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. శివాజీ, నవదీప్..ల నటన సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. వాళ్ళు వచ్చే ప్రతి సీన్ కి ఆడియన్స్ మంచి హై ఫీలవుతారు అని ధీమాగా చెబుతున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కథ చెబుతుందని అంటున్నారు.

మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ హత్తుకుంటుందట. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బరువెక్కిన గుండెతో థియేటర్ నుండి బయటకు వస్తారని.. ‘దండోరా’ని వీక్షించిన వారు చెబుతున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus