Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

ప్రస్తుతం సోషల్ మీడియాలో సీనియర్ నటుడు శివాజీ(Sivaji) వర్సెస్ అనసూయ, చిన్మయి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలే ఈ రచ్చకు ప్రధాన కారణం. దీనికి అటు చిన్మయి, ఇటు అనసూయ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ.. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sivaji

పబ్లిక్ ఈవెంట్స్‌కు వచ్చేటప్పుడు సావిత్రి, సౌందర్య లాగా పద్ధతిగా చీరలు కట్టుకోవాలని క్లాస్ పీకారు. అంతటితో ఆగకుండా.. గ్లామర్ పేరుతో ‘సామాన్లు’ (శరీర భాగాలు) కనిపించేలా బట్టలు వేసుకుంటే జనం నవ్వుకుంటారని, అది గౌరవం కాదని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన వాడిన “దరిద్రపు ముండ” అనే పదం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

ఒక ప్రొఫెషనల్ స్పేస్‌లో ఉండి తోటి నటీమణులపై ఇలాంటి బూతు పదాలు వాడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.శివాజీ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా గట్టిగానే బదులిచ్చారు. శివాజీ వాడిన భాషను ఆమె తప్పుబట్టారు. “అమ్మాయిలకు నీతులు చెప్పే మీరు మాత్రం జీన్స్, హూడీలు వేసుకొని మోడర్న్‌గా తిరగొచ్చు.. కానీ ఆడవాళ్లు మాత్రం పద్ధతిగా ఉండాలా?” అని లాజిక్ తీశారు.

“మీకు భారతీయ సంస్కృతిపై అంతగా ప్రేమ ఉంటే.. మీరు కూడా పద్ధతిగా పంచె కట్టుకోండి. నుదుటిన బొట్టు, పెళ్లయిన మగవారు కాబట్టి కాళ్లకు మెట్టెలూ పెట్టుకొని తిరగండి” అంటూ చిన్మయి సెటైరికల్‌గా కౌంటర్ వేశారు.మరోవైపు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. శివాజీ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తప్పు డ్రెస్సింగ్‌లో లేదని, చూసే చూపులో ఉందంటూ.. “ఇది నా శరీరం, మీది కాదు” అంటూ సింగిల్ లైన్‌లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

కాగా కొందరు శివాజీ చెప్పిన దాంట్లో నిజం ఉందని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం అనసూయ, చిన్మయి అడిగిన దాంట్లో పాయింట్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus