సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి అయితే ఈమె కథ ప్రాధాన్యత ఉన్న సినిమాల కోసమే ఎదురుచూసే కాస్త ఆలస్యంగా మంచి కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నటి మృణాల్ త్వరలోనే నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమాతో పాటు ఈమె విజయ్ దేవరకొండ సినిమాల్లో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హిందీ భాష సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మృణాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈమెను ప్రశ్నిస్తూ తన నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు స్టార్ కిడ్ నా అంటూ ప్రశ్నించగా ఈమె మాత్రం నేను స్టార్ కిడ్ కాదు కానీ నా పిల్లలు మాత్రం స్టార్ కిడ్స్ అవుతారు అంటూ సమాధానం చెప్పారు. ఇక మరొక నెటిజన్ మీరు ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమయ్యే వారు అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తాను (Mrunal Thakur) సమాధానం చెబుతూ తాను డెంటల్ డాక్టర్ అయ్యేదానిని అంటూ సమాధానం చెప్పారు.
నాకు చదువు పెద్దగా ఆసక్తి లేకపోయినా ఒత్తిడి కారణంగా డెంటల్ కోర్స్ జాయిన్ అయ్యానని అయితే ఓసారి ఆడిషన్ కి వెళ్ళగా అక్కడ సెలెక్ట్ కావడంతో వెంటనే ఇండస్ట్రీ వైపు వచ్చాను అంటూ ఈ సందర్భంగా మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.