Mahesh Babu, Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబుకు జక్కన్న విధించిన షరతులు ఇవేనా?

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించి, మహేష్ పాత్రకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ కొన్ని టైటిల్స్ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. అయితే మేకర్స్ మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు.

త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారని ఈ సినిమా కథకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అదిరిపోయే అప్ డేట్స్ అయితే రానున్నాయని భోగట్టా.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మహేష్ కెమెరాలకు, మీడియాకు దూరంగా ఉండేలా రాజమౌళి షరతులు విధించారని సమాచారం. మహేష్ బాబు సైతం జక్కన్న విధించిన షరతులకు అంగీకరించారని భోగట్టా. మహేష్ బాబు నెవర్ బిఫోర్ లుక్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేఎల్ నారాయణ ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.

రాజమౌళి (Rajamouli) ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్స్ట్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో నటించే ఛాన్స్ కోసం చాలామంది ఆర్టిస్టులు ట్రై చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇతర భాషల్లో సైతం ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus