Pawan Kalyan, Rana: ముహూర్తం ఫిక్స్ చేసిన పవన్ టీమ్!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కొన్ని రోజుల క్రితం మొదలైన సంగతి తెలిసిందే. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లను నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో షూటింగ్ పునః ప్రారంభించాలని అనుకుంటున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కొత్త షెడ్యూల్ ని జూలై 11 నుండి మొదలుపెట్టనున్నారు.

ఈ షెడ్యూల్ లో పవన్ తో పాటు రానా కూడా పాల్గోనున్నారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో షూటింగ్ ను నిర్వహించనున్నారు. సినిమాలో కీలక సన్నివేశాలను పోలీస్ స్టేషన్ లో చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానాకి జోడీగా ఐశ్వర్య రాజేష్ లు కనిపించనున్నారు.

ఇందులో పవన్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తుండగా.. రానా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus