ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…అన్న పాట గుర్తుందా…టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ పోకిరి సినిమాలో ఐటమ్ భామ ముమైత్ ఖాన్ అందచందాలను ఆరబోసిన పాట అది. ఐతే ఆ సినిమా ఆ పాట భారీ హిట్ కావడంతో ముమైత్ ఖాన్ ఎక్కడికో వెళ్లిపోయింది. సౌత్ ఇండియా…నార్త్ ఇండియా అంటూ…తేడా లేకుండా వరుస సినిమాలతో, వరుస ఐటమ్ సాంగ్స్ తో దూసుకుపోయింది. ఒకానొక క్రమంలో అత్యధిక పారితోషకం తీసుకున్న హాట్ ఐటమ్ బ్యూటీ గా ఆమె రికార్డు సైతం సృష్టించింది.
మరి అలాంటి ముమైత్ ఇప్పుడు ఎందుకలా చేసింది అంటే…ఈ కధ చదివితే తెలుస్తుంది. ముమైత్ తో ఒక ఐటమ్ సాంగ్ సినిమాలో పెట్టించడం అలవాటుగా మారిన రోజులు మారి, హీరోయిన్లు కూడా ఐటెం భామలుగా చిందులేయడానికి దిగిపోయిన రోజులు రావడంతో…ఐటెం భామలకు అవకాశాలు కరువయ్యాయి. అయితే అదే క్రమంలో రీసెంట్ గా విశాఖ పట్నం జిల్లా భీమిలీ మండలం చిప్పాడ గ్రామంలో సీతమ్మ తల్లి జాతరలో.. రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది.
ఈ ప్రోగ్రామ్ లో ముమైత్ ఖాన్ డ్యాన్సులే స్పెషల్ అట్రాక్షన్. ఓ ఈవెంట్ లో ఐటెం గాళ్ డ్యాన్సులు చేయడం వింత కాదు కానీ.. టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం పుచ్చుకున్న ముమైత్.. ఇలా రికార్డింగ్ డ్యాన్సుల స్థాయికి దిగిపోవడమే బాధాకరం అని అందరూ అనుకుంటున్నారు. సినిమాల్లో ఐటెం పాటల్లో నటిస్తూ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు అనిపించుకున్న ముమైత్ పరిస్థితి.. ఇప్పుడు చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. ఇలా చాలా మంది తారలు అవకాశాల కోసం ఇలా దిగజారిపోతూ ఉండడం చూస్తుంటే మన పరిశ్రమ ఎటు పోతుందో అన్న భయం పుడుతుంది.