ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ విడుదల

డిఫరెంట్ కథ, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’(Mutton Soup). ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రీసెంట్‌గా తనికెళ్ల భరణి రిలీజ్ చేసిన ‘హర హర శంకరా’ అనే పాట కూడా మంచి ప్రశంసల్ని దక్కించి, మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ గారు ‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే మరో మంచి మాస్ ఎనర్జిటిక్ నంబర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక గీతాన్ని సూరన్న రచించారు. సూరన్న, రేలారే రేలా గోపాల్, సుజాత వాసు కలిసి ఆలపించిన ఈ పాటకు వెంకీ వీణ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక లిరికల్ వీడియోని చూస్తుంటే సత్య మాస్టర్ కొరియోగ్రఫీ మరో స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది.

సాంగ్ రిలీజ్ చేసిన అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రామకృష్ణ వట్టికూటి సమర్పణలో రామచంద్ర వట్టికూటి తెరెకెక్కించారు. యంగ్ టీం చేసిన ఈ ప్రయత్నానికి పెద్ద సక్సెస్ దక్కాలి. సాంగ్ చాలా బాగుంది. అల వైకుంఠపురములో సూరన్న మంచి పాటను పాడారు. జాన పద గీతాలు ప్రస్తుతం ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ‘మటన్ సూప్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’లోని ‘కల్లు కొట్టు కాడ’ పాటను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి థాంక్స్. ఈ విషయంలో సహకరించిన మా సినీయర్ జర్నలిస్ట్ ప్రభు గారికి, మా అన్నకి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ పాట ఎస్ఆర్‌కే గారి వల్లే పుట్టింది. గోపాల్ గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. మా అన్న ,రామకృష్ణ నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. మా హీరో రమణ్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా సినిమాను పర్వతనేని రాంబాబు గారు నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘మాలాంటి చిన్న వాళ్లను ఆశీర్వదించేందుకు వచ్చిన మురళీ మోహన్ గారికి థాంక్స్. ‘కల్లు కొట్టు కాడ’ సాంగ్ చాలా బాగా వచ్చింది. వెంకీ వీణ మంచి బాణీని ఇచ్చారు. ఈ పాట వినగానే గ్రాండ్‌గా తీయాలని ఫిక్స్ అయ్యాం. త్వరలోనే మా ‘మటన్ సూప్’ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది’ అని అన్నారు.

నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ చిత్రంలోని ‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి థాంక్స్. ఇలాంటి పెద్దల సహకారం వల్లే మా లాంటి చిన్న నిర్మాతలు, మాలాంటి వాళ్లు తీసే చిన్న చిత్రాలు నిలబడుతున్నాయి. త్వరలోనే మా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.

హీరో రమణ్ మాట్లాడుతూ .. ‘మా ‘మటన్ సూప్’ సినిమాలోని మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు. ఈ విషయంలో సహకరించిన ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. రామచంద్ర గారు ఈ చిత్రాన్ని బాగా తీశారు. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నామ’ని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ సినిమా సాంగ్‌ని లాంఛ్ చేసేందుకు ముందుకు వచ్చిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు. కొత్త టీం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నానికి మురళీ మోహన్ లాంటి పెద్ద వాళ్లు సపోర్ట్ ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

గీత రచయిత సూరన్న మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ సినిమాలో ‘కల్లు కొట్టు కాడ’ పాటను రాయడం, పాడటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ పర్వ‌త‌నేని రాంబాబు మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ నుంచి వరుసగా సక్సెస్ ఫుల్ పాటలు వస్తున్నాయి. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ .. ‘మా ‘మటన్ సూప్’ సినిమాలోని ‘కల్లు కొట్టు కాడ’ పాటను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి థాంక్స్. ఈచిత్రంలోని పాటలన్నింటికీ కొరియోగ్రఫీ చేశాను. చిత్రం అద్భుతంగా వచ్చింది. త్వరలోనే ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.

నటుడు గోవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ చిత్రంలోని ‘కల్లు కొట్టు కాడ’ పాటను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి థాంక్స్. ఈ చిత్రంలో రామచంద్ర నాకు మంచి పాత్రను ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మూవీని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా పర్వ‌త‌నేని రాంబాబు, లైన్ ప్రొడ్యూస‌ర్‌గా కొమ్మా రామ కృష్ణ, ఎడిట‌ర్‌గా లోకేష్ క‌డ‌లి పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్‌.ఒ : మోహన్ తుమ్మల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus