Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

ఈ మధ్య వరుసగా సినీ సెలబ్రిటీలు మరణిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే అల్లరి నరేష్ తాతగారు, ఎస్.జానకి కుమారుడు మురళీకృష్ణ వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లోనే కాకుండా మిగతా భాషల్లోని సినీ ప్రముఖులు కూడా మరణించడం అనేది అందరినీ కలవరపరిచే విషయం. ఏదేమైనప్పటికీ ఈ షాక్..ల నుండి ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్లోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

Raghunatha Reddy

వివరాల్లోకి వెళితే… టాలీవుడ్ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి(Raghunatha Reddy) మృతి చెందారు.ఈయన వయసు 55 ఏళ్ళు. గుండెపోటు సంభవించడంతో రఘునాథ్ రెడ్డి కన్నుమూశారని సమాచారం. కొన్నాళ్లుగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఒక దశలో కోలుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి.ఇంతలో ఇలా జరిగింది. కొద్దిరోజుల క్రితం ఈయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ దిగులుతోనే ఈయన ఆరోగ్యం కూడా దెబ్బతింది అని స్పష్టమవుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్, విజయవాడకి చెందిన రఘునాథ్ రెడ్డి కన్నింగ్ విలనిజంకి పెట్టింది పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఈయన కన్నింగ్ విలన్ గా, సైడ్ విలన్ గా నటించి మెప్పించారు. దాదాపు 370కి పైగా సినిమాల్లో నటించారు. ఈయన డైలాగ్ డెలివరీకి కూడా సెపరేట్ క్రేజ్ ఉంటుంది. మాటలో స్పష్టత కనిపిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళ,హిందీ, బోజ్ పురి సినిమాల్లో కూడా నటించారు.

ఒక దశలో బిజీ ఆర్టిస్ట్ గా రాణించారు. అయితే తర్వాత పోటీలో నెగ్గుకురాలేకపోయారు. రఘునాథ్ రెడ్డి చివరిగా సుమంత్ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ లో కనిపించారు.

మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus