నేటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిన మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్నమూవీ మూడు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 60 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. గత రెండు నెలల్లో చెన్నై, హైదరాబాద్ లలో భారీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ నాలుగో షెడ్యూల్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో మొదలయింది.

నేటి నుంచి నెల రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ లో ఈనెల 27 నుంచి మహేష్ బాబు జాయిన్ అవుతారని చిత్ర బృందం తెలిపింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఆకట్టుకోనున్నారు. హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని వచ్చే ఏడాది జనవరి 26 న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus