సూపర్ స్టార్ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మురుగదాస్

Advertisement

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ తన తాజా చిత్రం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని చాలా శ్రద్ధ పెట్టి చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు చెన్నై లో షూటింగ్ పూర్తి చేసుకొని నగరానికి వచ్చిన మురుగదాస్ బృందం ప్రస్తుతం మూడో షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ప్రిన్స్ పై కొన్ని కీలక సీన్లు గత రెండు రోజులుగా షూట్ చేస్తున్నారు.

మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని మురుగదాస్ శ్రమిస్తున్నారు. అందుకే బడ్జెట్ పై కాకుండా క్వాలిటీపై ద్రుష్టి పెట్టారు. నెక్స్ట్ షెడ్యూల్ ని గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ప్లాన్ చేశారు. ఏకకాలంలో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ లో మహేష్ బాబు సరసన  ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జ్. సూర్య ప్రిన్స్ కి గట్టి పోటీ ఇవ్వనున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus