ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకి ఖరారైన సంగీత దర్శకుడు!
- May 16, 2017 / 05:58 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న జై లవ కుశ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ తో సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. అనంతరం అక్టోబర్ నుంచి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమాకి తాజాగా మ్యూజిక్ డైరక్టర్ ని ఫిక్స్ చేశారు.
త్రివిక్రమ్, పవన్ కంబో మూవీకి సంగీతమందిస్తున్న అనిరుధ్ ని ఎన్టీఆర్ సినిమాకి ఎంపిక చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. కోలీవుడ్ లో వై థిస్ కొలవరి అంటూ దుమ్ములేపిన యువ సంగీత దర్శకుడు తెలుగులోనూ మంచి ట్యూన్స్ ఇస్తుండడంతో అతన్ని మెచ్చుకొని మరో అవకాశాన్ని త్రివిక్రమ్ ఇచ్చినట్లు సమాచారం. తారక్ 28 వ చిత్రం వివరాలను అతని పుట్టిన రోజైన మే 20 న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















