మురళీధరన్ బయోపిక్ : ఫస్ట్ ఛాయిస్ ఆ ఇద్దరు హీరోలే..!

విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక క్రికెటర్ దిగ్గజం అయిన ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే వివాదాలకు దారితీయడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు.800 పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు. టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డుని సృష్టించిన మురళీధరన్ జీవితంలో చాలా ట్రాజెడీ ఉందని.. అది సినిమాగా తెరకెక్కించి అందరికీ తెలియజేయాలనుకున్న దర్శకుడికి..

ఆరంభంలోనే పెద్ద దెబ్బ పడింది.విజయ్ తప్పుకున్నప్పటికీ.. ఈ ప్రాజెక్టు అయితే ఉంటుంది అని దర్శకనిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే..’800′ కి విజయ్ సేతుపతి ఫస్ట్ ఛాయిస్ కాదట. అతని కంటే ముందే ఈ బయోపిక్ ను ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. వారిలో ఒకరు … ధనుష్ అని తెలుస్తుంది. రిస్క్ అనిపించి ఆయన ముందుగానే తప్పుకున్నాడని స్పష్టమవుతుంది. ధనుష్ తరువాత ‘అసురన్’ లో అతని ‌పెద్ద కొడుకుగా నటించిన తీజయ్‌ని కూడా ఈ సినిమా కోసం సంప్రదించారట.

అతను కూడా ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ నో చెప్పడంతో విజయ్ సేతుపతి వద్దకు వెళ్లారట. అతను ఓకే చెప్పినా కూడా వర్కౌట్ కాలేదు. మరి ఈ ప్రాజెక్టుని ఏ హీరోతో రూపొందిస్తారో చూడాలి..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus