9 ఏళ్లుగా సరైన హిట్టు కోసం కిందా మీదా పడుతున్న అల్లరి నరేష్.. 2021 ఆరంభంలో కూడా ‘బంగారు బుల్లోడు’ తో నిరాశపరిచాడు. అయినప్పటికీ డిజప్పాయింట్ అవ్వకుండా వెంటనే ఫిబ్రవరి 19న ‘నాంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు.ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. మొదటి రోజు హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఆ రోజున ఆశించిన మేర కలెక్ట్ చెయ్యలేకపోయినా…ఆ తరువాత నుండీ బాగానే పికప్ అయ్యింది.
ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
1.22 cr
సీడెడ్
0.40cr
ఉత్తరాంధ్ర
0.27 cr
ఈస్ట్
0.22 cr
వెస్ట్
0.17 cr
గుంటూరు
0.24 cr
కృష్ణా
0.25 cr
నెల్లూరు
0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.91 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.06 cr
ఓవర్సీస్
0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.07 cr (షేర్)
‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 3.07 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో 0.13 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజుతో దాదాపు అది పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.